బియ్యం లారీ పట్టివేత 510 బస్తాల బియ్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

బియ్యం లారీ పట్టివేత 510 బస్తాల బియ్యం స్వాధీనం

Published Tue, Sep 17 2013 4:09 AM

lorry seiezed and hand over 510 packets of rice



 మానవపాడు, న్యూస్‌లైన్ : ఎలాంటి అనుమతి లేకుండా కర్ణాటక రాష్ట్రానికి ఓ లారీలో 210 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... సోమవా రం తెల్లవారుజామున భూత్పూరు మండలం శేర్‌పల్లిలోని వెంకటేశ్వర ఇండస్ట్రీస్ నుంచి 510 బస్తాల బియ్యం (210 క్వింటాళ్లు) తో ఓ లారీ కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేటకు బయలుదేరింది. మార్గమధ్యంలోని అలంపూర్‌చౌరస్తా దాటుతుండగా మానవపాడు పోలీసులు అనుమానం వచ్చి స్టేషన్‌కు తరలించి పౌరసరఫరా ల అధికారులకు సమాచారమిచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకు డివిజన్ అసిస్టెంట్ పౌ రసరఫరాల అధికారి ప్రభాకర్‌రెడ్డి వచ్చి అందులోని బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వీటి వి లువ సుమారు *2.6 లక్షలు ఉంటుందన్నారు. ఈ మేరకు డ్రైవర్ తోపాటు బియ్యం విక్రయించే యజమానిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ కా ర్యక్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రాజు, ఓంప్రకాశ్; మానవపాడు ఆర్‌ఐ జయంతి, వీఆర్‌ఓలు చంద్రయ్య, ఫణిమోహన్‌రావు, సుబ్బారెడ్డి, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 
 దాడులు కొనసాగిస్తున్నాం : డీఎస్‌ఓ
 కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 250 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్లు డీఎస్‌ఓ సయ్యద్‌యాసిన్ వెల్లడించారు. సోమవారం త న చాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రేష న్ షాపులపై దాడులు నిర్వహించి విక్రయిం చిన స్టాక్‌తోపాటు నిల్వలో ఏమైనా తేడా ఉంటే వాటిని వెంటనే సీజ్ చేస్తున్నామన్నారు. ఇందు లో భాగంగా అలంపూర్‌క్రాస్ రోడ్‌లో బాయిల్డ్ రైస్ 200 క్వింటాళ్లను అనుమతి లేకుండా తరలి స్తుంటే వాటిని సీజ్ చేశామన్నారు. అలాగే గద్వాలలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మినీ డీసీఎంలో తరలిస్తుండగా ఏఎస్‌ఓ పట్టుకుని కే సు నమోదు చేశారన్నారు. అచ్చంపేటలోని ఓ రేషన్ షాపులో అక్రమంగా ఉన్న మూడు క్విం టాళ్ల బియ్యం, వంద లీటర్ల కిరోసిన్‌ని స్వా ధీనం చేసుకున్నామన్నారు. మద్దూరు మండ లం మోమినాపూర్‌లోని ఓ రేషన్ షాపును తనిఖీ చేశామన్నారు. అక్కడ అమ్మహస్తం పథకానికి సంబంధించి డీడీలు కట్టకపోగా, లబ్ధిదారులకు ఎలాంటి సరుకులు పంపిణీ చేయనందుకు డీలపై చర్య తీసుకోవాలని నారాయణపేట ఆర్డీఓ యాస్మిన్‌బాషాను ఆదేశించామన్నారు. వీటితోపాటు భూత్పూరు మండలంలోని రెండు పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేసి కనీస సదుపాయాలు లేనందున జే సీ శర్మన్‌కు నివేదిక సమర్పించామన్నారు.

Advertisement
Advertisement