ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు! | Sakshi
Sakshi News home page

ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!

Published Thu, Apr 28 2016 4:28 AM

ఔను వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!

రెడ్డివారిపల్లె అమ్మాయి... ప్యారీస్ అబ్బాయితో ప్రేమ
అమ్మాయి స్వగ్రామంలో ఘనంగా వివాహం

 
ములకలచెరువు: మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన అమ్మాయి, ప్యారీస్ అబ్బాయి ప్రేమ వివాహం బుధవారం అమ్మాయి స్వగ్రామంలో తల్లిదండ్రుల, బంధువుల సమక్షంలో జరిగిం ది. అమ్మాయి కుటుంబ సభ్యు లు కథనం మేరకు... మండలంలోని వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన ఏ. వెంకటరమణ, ఏ.సిద్దలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె ఏ.సుభాసిణి బీటెక్ పూర్తి చేసి, ఎంటెక్ చదివేందుకు ఫ్రాన్స్‌లోని ప్యారీస్‌కు మూడు సంవత్సరాల క్రితం వెళ్లింది. ఢిల్లీకి చెందిన ప్యారిస్‌లోని ప్రవాస భారతీయుడు మక్కం, హరిజిత్ దంపతుల సంతతి అయిన తన తోటి విద్యార్థి అయిన సత్వంత్‌ను ప్రేమించింది. వారి ప్రేమను ఇద్దరి కుటుంబాల పెద్దలు అంగీకరించారు. ఈ క్రమంలో బుధవారం సుభాసిణి స్వగ్రామమైన రెడ్డివారిపల్లె యోగానంద ఆశ్రమంలో వారి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు.
 

Advertisement
Advertisement