ప్రియుడిని చంపిన ప్రియురాలు | Sakshi
Sakshi News home page

ప్రియుడిని చంపిన ప్రియురాలు

Published Thu, Nov 6 2014 3:09 AM

Lover kills girlfriend

కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే భయంతో కుటుంబసభ్యులతో కలిసి దారుణం
 
 డోన్‌టౌన్:
 వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కుమార్తె పెళ్లి ఆగిపోతుందనే అనుమానంతో ప్రియుడిని ప్రియురాలే తన కుటుంబసభ్యులతో కలిసి పథకం ప్రకారం హత్యచేసింది. రైల్వే ఎస్‌ఐ ఏవీ నారాయణ కథనం మేరకు..ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామానికి చెందిన వెంకటమాధవక్రిష్ణారెడ్డి 13 ఏళ్ల క్రితం కర్నూలుకు చేరాడు.

ఆదోని రోడ్డులో ఉన్న డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. వృత్తి రీత్యా లారీలు, ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య పావని, కుమారుడు యశంత్‌రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో సంతోష్ నగర్‌లో హోటల్ నడుపుతున్న లక్ష్మీకాంతమ్మతో పరిచయమైంది. ఈమె భర్తను విడిచి ఉండడంతో ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సమయంలో కుమార్తెకు పెళ్లి సంబంధం కుదిరింది. తన విషయం తెలిస్తే కుమార్తె వివాహం ఆగిపోతుందేమోనని ఆమె భావించింది.

ఎలాగైనా వెంకటమాధవక్రిష్ణారెడ్డి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. విషయూన్ని తన చెల్లెలు పెద్ద బీమక్కకు తెలిపింది. పథకంలో భాగంగా పెద్దబీమక్క అతనితో తరచూ మాట్లాడేది. ఈ నేపథ్యంలో మొహర్రం పండుగకు లింగనేనిదొడ్డి గ్రామానికి  రావాలని పిలిచింది. దీంతో అతడు ఆదివారం అక్కడికి వచ్చాడు. అక్కడ లక్ష్మీకాంతమ్మ, ఆమె చెల్లెళ్లు పెద్దబీమక్క, చిన్నబీమక్క, మరిది నర్సింహులు, సోదరుడు రంగన్న కలిసి తాళ్లతో కట్టేసి హత్యచేశారు.

ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేశారు. రైళ్లు అతడి శరీరంపై వెళ్లడంతో నుజ్జునుజ్జరుు గుర్తుపట్టలేని విధంగా తయూరైంది. సోమవారం రైల్వే పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి, శవాన్ని డోన్‌లోనే పూడ్చేశారు.
 
 మిస్సింగ్ కేసు హత్యకేసుగా నమోదు..

 వెంకట మాధవక్రిష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో ఆయన బావ తిమ్మారెడ్డి గత సోమవారం కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో లక్ష్మికాంతమ్మ, ఆమె కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వారిని విచారించడంతో హత్యవిషయం వెలుగుచూసింది. అనుమానాస్పద స్థితికేసు హత్యకేసుగా మారడంతో గురువారం రీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement