డ్రైవింగ్ నేర్చుకుంటూ మృత్యువాత | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్ నేర్చుకుంటూ మృత్యువాత

Published Fri, Feb 26 2016 1:29 PM

man dies over learning driving

అల్లవరం: డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో జరిగిన ప్రమాదం ఓ వ్యక్తి మృతికి దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం వద్ద ఈ ఘటన జరిగింది. జల్లి సురేష్ (30), సంజయ్‌కుమార్ తెలిసిన వ్యక్తి ఆటోను తీసుకుని డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి పంటకాల్వలోకి దూసుకుపోయి బోల్తా కొట్టింది. సురేష్ మృతి చెందగా, సంజయ్‌కుమార్ నడుము విరిగింది. దీంతో అతనిని అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
Advertisement