మా షాపుకు వస్తే మట్టి గణపతి ఇస్తాం

3 Sep, 2019 09:25 IST|Sakshi

సాక్షి, దర్శి: మా షాపునకు వస్తే మట్టి గణపతి ఇస్తామని వినూత్న రీతిలో దర్శికి చెందిన సాగర్‌ ఫ్యాన్సీ అధినేత కల్లూరి విద్యాసాగర్‌ రెడ్డి మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. అయితే కొనుగోలు చేసేందుకు షాపుకు వచ్చిన అందరికీ విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొనుగోలు చేసినా చేయక పోయినా తమ షాపుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ విగ్రహాలు ఇస్తున్నామని సాగర్‌ తెలి పారు. స్నేహితులు, బంధువులకు ఫోన్‌ చేసి మరీ విగ్రహాలు తీసుకు వెళ్లమని కోరడం గమనార్హం. గతంలో సాగర్‌ లయన్స్‌ క్లబ్‌ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అప్పట్లో పర్యావరణ పరి రక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

మరిన్ని వార్తలు