Sakshi News home page

రూ.100 ఇస్తేనే భోజనం!

Published Wed, May 18 2016 11:35 PM

Meal give Rs 100

శ్రీకాకుళం టౌన్: డిజిటల్ పాలన కోసం గ్రామస్థాయి అధికారులకు కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1101 పంచాయతీల్లోనూ కార్యాల యాల్లో కంప్యూటర్లు అమర్చి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కంప్యూటర్ పరిజ్ఞానం లేని కార్యదర్శులకు, ఈఓపీఆర్‌డీలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 1101 పంచాయతీల్లో పనిచేస్తున్న 541 మంది పంచాయతీ కార్యదర్శులకు బుధవారం నుంచి డివిజన్ల వారీగా చిలకపాలెంలోని శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో కంప్యూటర్ శిక్షణ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది.
 
  ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా... శిక్షణకు హాజరవుతున్న కార్యదర్శులకు టీఏ, డీఏలు ఇవ్వకపోగా భోజనానికి కూడా రూ.100 చెల్లించాలని కండీషన్లు పెడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ వసూళ్ల బాధ్యతను కూడా ఈఓపీఆర్‌డీలకే అప్పగించారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ కంప్యూటర్లు సమకూర్చడానికి వీల్లేకపోవడం వల్ల జిల్లాస్థాయిలో ఒకే చోట శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ కోసం ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కార్యదర్శులే భోజనం ఖర్చులు భరించాల్సి వ స్తోందని చెప్పారు. రవాణా, ఇతర భత్యాలకు కార్యదర్శులే నేరుగా భరించాలన్నారు. రూ.100 చెల్లిస్తే భో జనం, టీ, బిస్కెట్‌లు పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు.  
 

Advertisement
Advertisement