115 మందితో డీసీసీ కార్యవర్గం | Sakshi
Sakshi News home page

115 మందితో డీసీసీ కార్యవర్గం

Published Thu, Aug 15 2013 6:19 AM

Medak DCC New Committee formed

జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. పీసీసీ జిల్లా పరిశీలకులు నర్సింహారెడ్డితో కలిసి బుధవారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. డీసీసీ అధ్యక్షుడితో పాటు మరో 114 మందికి కార్యవర్గంలో చోటు కల్పించామన్నారు. మరింత మంది క్రియాశీల కార్యకర్తలకు త్వరలో డీసీసీ కార్యవర్గంలో చోటు కల్పిస్తామని సూచన ప్రాయంగా వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట గురువారం పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ సోమవారం పార్టీ కార్యాలయంలో ప్రజల నుంచి  సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి పార్టీ పరంగా కృషి చేస్తామన్నారు.
 
త్వరలో పార్టీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేస్తామని భూపాల్‌రెడ్డి ప్రకటించారు. సోనియా హామీ మేరకు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో డిప్యూటీ సీఎం ప్రత్యేక కృషి చేశారని భూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వాసుల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేరిందని పార్టీ జిల్లా ఇన్‌చార్జి నర్సింహారెడ్డి అన్నారు. 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా జరుగుతాయన్నారు. సమావేశంలో కొలన్ బాల్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి, కార్పొరేటర్ పుష్పా నగేశ్ యాదవ్, శంకర్ యాదవ్, మోహన్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, సాబేర్, పట్నం సుభాష్ పాల్గొన్నారు.
  
డీసీసీ కార్యవర్గమిదే..
ఉపాధ్యక్షులుగా నారాయణరెడ్డి, రాంచంద్రారెడ్డి, దుర్గారెడ్డి, శంకర్‌గౌడ్(నర్సాపూర్), బి.నగేశ్ యాదవ్, ఎన్.మాణిక్యం, బి.మల్లేశం, ఎం. శ్రీనివాస్ గౌడ్, టి.కుమార్‌గౌడ్, జి.రత్నం(పటాన్‌చెరు), ఎండి.గౌస్, మునిపల్లి సత్యనారాయణ, యాదయ్య, జానయ్య, అశోక్‌రెడ్డి(సంగారెడ్డి), నాయిని యాదగిరి, సాయిబాబా(గజ్వేల్), ఎన్. అడివిరెడ్డి, బస్వరాజ్‌పాటిల్, జి. ప్రతాప్‌రెడ్డి(జహీరాబాద్), పి.పెద్దన్న, ఎం.వజీరుద్దిన్. గుండేటి శ్రీనివాస్ (సిద్దిపేట), కె.సురేందర్‌రెడ్డి, అల్కారి సత్యనారాయణ, లక్ష్మినారాయణ, రాఘవాచారి(నారాయణఖేడ్), కేదార్‌నాథ్, నారాయణ్‌గౌడ్, రాజేందర్ పాటిల్(అందోలు), జి.క్రిష్ణాగౌడ్, కె.నర్సాగౌడ్, ఆర్.అంజిరెడ్డి, బి.గోపాల్‌రెడ్డి(మెదక్), గౌస్ మొహినొద్దిన్, అనంతుల శ్రీనివాస్(దుబ్బాక) నియమితులయ్యారు.
 

Advertisement
Advertisement