మరువలేని సంఘసంస్కర్త జ్యోతిరావుపూలే | Sakshi
Sakshi News home page

మరువలేని సంఘసంస్కర్త జ్యోతిరావుపూలే

Published Tue, Apr 12 2016 5:00 AM

మరువలేని సంఘసంస్కర్త   జ్యోతిరావుపూలే - Sakshi

నెల్లూరు(సెంట్రల్): మహాత్మా జ్యోతిరావు పూలే మరువలేని గొప్ప సంఘసంస్కర్తని నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్ పేర్కొన్నారు. జ్యోతి రావుపూలే 190వ జయంతిని పురస్కరించుకుని  నగరంలోని  మినీబైపాస్‌రోడ్డులో విజయమహల్‌గేటు సమీపంలో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు సోమవారం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి పూలే సేవలను కొనియాడారు. వెలగపల్లి వరప్రసాద్ మాట్లాడుతూ మహిళా విద్యను ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేశారు.
 
 అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేయాలి:

సంఘసంస్కర్తగా జ్యోతిరావు పూలే దేశానికి అందించిన సేవలు మరువలేనివని నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే స్మృతి వనాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరారు. - పీ అనిల్‌కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే
 
మహాత్ముని ఆలోచనలను సాకారం చేద్దాం
:

మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను , ఆలోచనలను సాకారం చేద్దామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పూలే కలలను సాకారం చేసేందుకు బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
 - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే
 
 మహిళా విద్యకు ప్రోత్సాహం:
మహాత్మా జ్యోతిరావుపూలే మహిళా విద్యను ఎంతగానో  ప్రోత్సహించారని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇంతియాజ్ అహ్మద్, బీసీ సంక్షేమ అధికారి సంజీవయ్య, కార్పొరేషన్ ప్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, కార్పోరేటర్లు గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, నాయకులు కొణిదల సుధీర్, శ్రీనివాసులురెడ్డి, సత్యానందం, నారాయణ యాదవ్, విశ్వరూపాచారి, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు. - ముక్కాల ద్వారకానాథ్,  డిప్యూటీ మేయర్

Advertisement

తప్పక చదవండి

Advertisement