రూ.50 లక్షల ధాన్యంతో వ్యాపారి పరార్

24 Sep, 2015 16:50 IST|Sakshi

ఈపూర్ (గుంటూరు) : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి డబ్బులు ఇవ్వకుండా వ్యాపారి ఉడాయించాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొచ్చర్ల గ్రామంలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాకుమాన్ శ్రీనివాస్ వడ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన దాదాపు 60 మంది రైతుల నుంచి రూ. 50 లక్షల విలువైన ధాన్యం కొనుగోలు చేశాడు. అయితే రైతులకు డబ్బు చెల్లించలేదు. మా డబ్బులు ఎప్పుడిస్తావు అని రైతులు అడిగేసరికి ఊరు వదిలి పరారయ్యాడు. దీంతో ఆందోళన చెందిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరిన్ని వార్తలు