విశాఖపట్నం: పనస వ్యాపారి దారుణ హత్యకు గురైన సంఘటన విశాఖపట్టణం జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో ఆదివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాజువాకకు చెందిన పాపారావు శనివారం తాజంగి గ్రామానికి చేరుకున్నాడు. సాధారణంగా వచ్చిన రోజే గ్రామంలోని పనస చెట్లను కొనుగోలు చేసి, కాయలు తెంపుకుని వెంటనే వాహనంలో తరలించుకుని వెళ్లిపోతుంటాడు.
అయితే, సాయంత్రం పనస తోటలోకి వెళ్లిన ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఆదివారం ఉదయం విగతజీవిగా కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.