వారధి పనులపై మంత్రి ఆగ్రహం | Sakshi
Sakshi News home page

వారధి పనులపై మంత్రి ఆగ్రహం

Published Mon, May 18 2015 1:38 AM

Minister Siddha Raghav Rao fire on Road bridge civil works

కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన,
 రెండో రోడ్డు వంతెన నిర్మాణ పనుల పరిశీలన
 పనులను వేగిరపర్చాలని మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశం
 
 కొవ్వూరు: కొవ్వూరు రోడ్డు కం రైలు వంతెన, కొవ్వూరు-రాజమండ్రి రెండో రోడ్డు వంతెన నిర్మాణ పనుల జాప్యంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శిద్ధా రాఘరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రెండు వారధుల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు పురోగతి లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. రోడ్డు కం రైలు వంతెనపై పుట్‌పాత్‌లు, రైలింగ్‌లు సక్రమంగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ముందుగా తూర్పుగోదావరిలోని పలు రోడ్ల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. బ్రిడ్జి మరమ్మతులు నెలాఖరు నాటికి పూర్తి చేయూలని ఆదేశించారు.
 
 అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.850 కోట్ల పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 65 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. రోడ్డు కం రైలు వంతెన మరమ్మతులు నిర్దేశిచిన సమ యం కంటే నెలరోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు. జాయింట్ల వద్ద వేసే ప్లాస్టిక్ షీట్లు సకాలంలో లభించకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు సార్లు పుష్కర పనులను పరిశీలించినట్టు మంత్రి తెలిపారు. అనంతరం రెండో రోడ్డు వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు.
 
 అక్కడా పనులు అసంపూర్తిగా ఉండట ంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేనెల మొదటివారం లోపు పనులు పూర్తికావాలని ఆదేశించారు. పనులను వేగిరపర్చకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మూర్తి, కొవ్వూరు ఆర్‌అండ్‌బీ ఈఈ ఎస్.శ్రీనివాసులు, డీఈఈ ఎ.శ్రీకాంత్, అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement