విద్యా శాఖకు భారీ బడ్జెట్ | Sakshi
Sakshi News home page

విద్యా శాఖకు భారీ బడ్జెట్

Published Mon, Jan 12 2015 6:26 AM

Ministry of Education budget

  • రూ.18,250 కోట్లు కేటాయింపు
  • పరీక్ష హాళ్లలో సీసీ కెమెరాలు  మంత్రి గంటా వెల్లడి
  • విశాఖపట్నం సిటీ: రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ విద్యా శాఖకు రూ. 18,250 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని రాష్ట్ర మానవ వనరుల, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రోటరీ ఇండియా లిటరసీ మిషన్ కార్యక్రమంలో భాగంగా  చెన్నై రోటరీ అందిస్తున్న రూ. 20 లక్షల విలువైన 32లక్షల పుస్తకాలను జీవీఎంసీ ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేసే కార్యక్రమం ఆదివారం ఓ హోటల్‌లో జరిగింది. విశాఖలోని 54 మున్సిపల్ పాఠశాలలకు బుక్ బ్యాంక్ కోసం ఈ 32 లక్షల పుస్తకాలను పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ  2017 నాటికి రాష్ట్రంలో నూరు శాతం అక్షరాస్యతకు ప్రయత్నిస్తున్నామన్నారు. పరీక్ష కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్ జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు   చేయనున్నట్టు ప్రకటించారు.ఎయిడెడ్ పాఠశాలల్లో సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని మార్పులు చేయబోతున్నామని, పిల్లల యూనిఫాంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్, క్రీడా మైదానాలు, ఆధునిక టాయిలెట్లు వంటి సదుపాయాలు కల్పిస్తామని వివరించారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement