మిస్ సింహపురిగా కల్యాణి | Sakshi
Sakshi News home page

మిస్ సింహపురిగా కల్యాణి

Published Mon, Nov 25 2013 4:11 AM

mirrors miss simhapuri -2013 Kalyani claimed

నెల్లూరు(బృందావనం), న్యూస్‌లైన్: ‘మిర్రర్స్ మిస్ సింహపురి-2013’ కిరీటాన్ని నెల్లూరు నగరానికి చెందిన కల్యాణి దక్కించుకొంది. స్థానిక పురమందిరంలో ఆదివారం మిర్రర్స్ బ్యూటీపార్లర్ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ అందాల యువరాణి పోటీల్లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి మూడుస్థానాల్లో కె.కల్యాణి(మూలాపేట), పి.అనిషారెడ్డి (బాలాజీనగర్), ఎం.లక్ష్మీప్రీతి  (రంగనాయకులపేట) నిలిచారు.


ముఖ్య అతిథిగా హాజరైన హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహానగరాలకే పరిమితమైన ఇలాంటి పోటీలను నెల్లూరులో తొలిసారిగా నిర్వహించడం అభినందనీయమన్నారు. మిర్ర ర్స్ బ్యూటీపార్లర్ అధినేత నాగిశెట్టి లాలిత్యసుమన్ మాట్లాడుతూ భారతీయ సంప్రదాయ విలువలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఈ పోటీలు దోహదపడుతాయన్నారు. మిస్‌బ్యూటిఫుల్, మిస్‌ట్రెడిషనల్, మిస్‌స్మైల్, మిస్‌హెయిర్, మిస్‌పర్సనాలిటీ, మిస్‌ఎక్స్‌ప్రెషన్స్, మిస్‌ఫొటోజెనిక్, మిస్ స్కిన్, మిస్‌కాస్మొటిక్స్ తదితర 25 విభాగాల్లో పోటీలను నిర్వహించామన్నారు. తొలిమూడు స్థానాలు సాధించిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతితోపాటు, కిరీటాలు, ముత్యాలహారాలు,జ్ఞాపికలను  జోయాలుక్కాస్, కాస్మోటిక్స్‌ప్లస్ , మిర్రర్స్‌బ్యూటీపార్లర్ సహకారంతో అందచేస్తున్నామన్నారు.
 
 
 పోటీల న్యాయనిర్ణేతలుగా చీతిరాల పద్మావతి, సుప్రజ, దుర్గాదేవి, అన్నపూర్ణమ్మ, లావణ్య వ్యవహరించారు. విజేతలకు అమరావతికృష్ణారెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, ఎస్‌వీఆర్‌స్కూల్ అధినేత అందె శ్రీనివాసులు, పెనుశిల డ్రైవింగ్‌స్కూల్ అధినేత శ్రీనివాసులురెడ్డి, టీవీ సుబ్బారావు, కోసూరురత్నం తదితరులు బహుమతులు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులుగా గాలికిరణ్‌కుమార్, వై.సుమన్ వ్యవహరించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement