విశాఖలో పనిచేయని సెల్ఫోన్లు | Sakshi
Sakshi News home page

విశాఖలో పనిచేయని సెల్ఫోన్లు

Published Mon, Oct 13 2014 8:06 AM

విశాఖలో పనిచేయని సెల్ఫోన్లు - Sakshi

విశాఖపట్నం:  హుదూద్ పెను తుఫాన్ నుంచి విశాఖ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తుపాను తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. క్రమంగా ఈదురుగాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి వస్తోంది. తుఫానుతో అతలాకుతలమైన విశాఖలో సోమవారం ఉదయం సహాయక చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ బలగాలతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు విశాఖలో నష్టాన్ని అంచనా వేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలు నగరంలో మకాం వేశాయి.

మరోవైపు  నగర ప్రజలు ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు. తాగునీరు, నిత్యావసరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇక అపార్ట్‌మెంట్లు, సెల్లార్లలో వర్షపునీరు నిలిచింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్లు కూలిపోయాయి. తుఫాను దాటికి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటంతో నగరం అంధకారంలోనే ఉంది. దాంతో సెల్ఫోన్లు కూడా పనిచేయటం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement