మో‘డల్’ విద్య | Sakshi
Sakshi News home page

మో‘డల్’ విద్య

Published Sun, Oct 27 2013 4:08 AM

Modal education

చిత్తూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొరత తీవ్రంగా ఉంది. 2011 లోనే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా భవనాల నిర్మాణం పూర్తికాకపోవడంతో 2013 విద్యా సంవత్సరంలో 6, 7, 8, ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలున్నారు. వీటిలో ప్రిన్సిపాల్స్, పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్)లు పూర్తి స్థాయిలో లేరు.

టీజీటీ (టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినప్పటికీ వీరిలో కొంత మందిని మాత్రమే నియమించారు. ప్రిన్సిపాల్, పీజీటీ పోస్టుల కోసం అభ్యర్థులు అర్హత పరీక్ష రాసినప్పటికీ కొంతమంది విధుల్లో చేరకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో 16 మంది ప్రిన్సిపాల్స్‌కు ఐదుగురు, 160 మంది పీజీటీలకు 131 మంది, 112 మంది టీజీటీలకు ఐదుగురు మాత్రమే ఉన్నారు.
 
ఐదు చోట్లే ప్రిన్సిపాళ్లు

 విద్యాపరంగా వెనకబడిన మండలాల్లో మోడల్ పాఠశాల లు ఏర్పాటు చేశారు. కేవీబీపురం, కేవీపల్లి, కురబలకోట, పుంగనూరు, ఎర్రావారిపాళెం మండలాల్లోని పాఠశాలల్లో మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. మిగిలిన చోట్ల ఎంఈవోలు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరికి మండల స్థాయిలో అనేక పనులు ఉండడంతో మోడల్ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ చూపలేకపోతున్నారనే విమర్శలున్నాయి. టీజీటీలు హిందీ సబ్జెక్టుకు మాత్రమే కేవీబీపురం, కేవీపల్లి, కలకడ, కు రబలకోట, పుంగనూరు మండలాల్లో ఉన్నారు.

పీజీటీలు ఒక్కో పాఠశాలలో 10 మంది ఉండాల్సి ఉండగా బి.కొత్తకోటలో ఆరుగురు, బెరైడ్డిపల్లెలో తొమ్మిది మంది, గుడిపల్లిలో ఇద్దరు, కలకడలో తొమ్మిది మంది, కుప్పంలో ఏడుగురు, కేవీబీపురంలో తొమ్మిదిమంది, కేవీపల్లిలో తొమ్మిది మంది, కురబలకోటలో ఆరుగురు, పెద్దమండ్యంలో తొమ్మిది మంది, పీటీఎంలో ఐదుగురు, పుంగనూరులో ఏడుగురు, శాంతిపురంలో తొమ్మిది మంది, తంబళ్లపల్లిలో ఐదుగురు, ఎర్రావారిపాళెంలో తొమ్మిది మంది మంది ఉన్నారు.
 

Advertisement
Advertisement