కొలిక్కిరాని మోడల్ | Sakshi
Sakshi News home page

కొలిక్కిరాని మోడల్

Published Fri, Mar 13 2015 2:44 AM

Model constituency selection focus

సాక్షి ప్రతినిధి, విజయనగరం :ఉత్తర్వులు వచ్చి నెలరోజులవుతున్నా అటు అధికారులు గాని, ఇటు ప్రజా ప్రతి నిధులు గాని మోడల్ నియోజకవర్గం ఎంపికపై దృష్టి సారించడం లేదు.    ఏకాభిప్రాయం కుదరకో, పోటీ పడటం వల్లో  తెలియదు గాని ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడం వల్ల ఎంపిక విషయంలో అధికారులు ముందడుగు వేయడం లేదు.  ఏ నియోజకవర్గం పేరు ప్రస్తావిస్తే ఎవరి నుంచి ఇబ్బందులొస్తాయోనన్న భ యంతో  అధికారులు ప్రజా ప్రతినిధుల కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పేరు ఎత్తితేనే తమకెందుకీ గొడవని తప్పించుకుంటున్నారు.
 
 జిల్లాకొక అసెంబ్లీ నియోజకవర్గాన్ని  మోడల్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పలు రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తయారు చేసేం దుకు  ఈ ప్రతిపాదన చేశారు.  ఆమేరకు జిల్లా ల వారీగా ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ప్రతిపాదనల రూపంలో పంపించాలని అటు మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఇటు అధికారులకు ఆదేశించారు. గతనెల 12న ప్రత్యేక ఉత్తర్వులు  జారీ చేశారు.   కానీ జిల్లా ఏ ఒక్కరూ ఇంతవరకు  మోడల్ నియోజకవర్గ ఎంపిక జోలికెళ్లలేదు. ప్రజాప్రతినిధులు చొరవ చూపకపోవడంతో అధికారులు సాహసం చేయడం లేదు. నేతలందరూ కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
 
 అయితే జిల్లాలో ఆ పరిస్థితుల్లేవు. మంత్రి, ఎమ్మెల్యేల మధ్య అభిప్రాయ బేధాలున్నాయి. తీవ్ర స్థాయిలో విభేదించుకుంటున్నారు. ఒకరి ప్రతిపాదనను మిగతా వారు ఇష్టపడతారన్న నమ్మకం లేదు. ఆ ఉద్దేశంతోనే అధికారులు ముందుకెళ్లి ఎంపిక ప్రక్రియను నిర్వహించేందుకు ధైర్యం చేయడం లేదు.   ప్ర జాప్రతినిధులు పిలిచినప్పుడే వెళ్దామన్న ధోరణిలో ఉన్నారు. అలాగని మంత్రి, ఎమ్మెల్యేలు కూడా ఇంతవరకు మోడల్ నియోజకవర్గ ఎంపికపై దృష్టిసారించలేదు. కలిసి కూర్చొనే ప్రయత్నమూ జరగలేదు. 

Advertisement
Advertisement