11న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం | Sakshi
Sakshi News home page

11న వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం

Published Fri, Feb 8 2019 1:05 PM

This Month 11th YS Jagan Meeting in Anantapur - Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న అనంతపురంలో సమర శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ఈ నెల 6న తిరుపతి నుంచి సమర శంఖారావాన్ని పూరించారన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 11న సభ నిర్వహిస్తామన్నారు. ఉదయం 11 గంటలకుఅన్న పిలుపు కార్యక్రమంలో భాగంగా తటస్థులతో సమావేశం ఉంటుందన్నారు.

సమర శంఖారావం సభ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు, సామాన్యులకు భరోసాను కల్పించే దిశగా కార్యక్రమం సాగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యకర్తలు, బూత్‌ కన్వీనర్లతో సమీక్షిస్తారన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, పార్టీ సమన్వయకర్తలు వై.వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు రాగే పరశురాం, మహాలక్ష్మి శ్రీనివాస్, నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్‌ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు.

సమాచారమివ్వడం ప్రభుత్వ బాధ్యత
అనంతపురం రూరల్‌: సమాచార హక్కు చట్టా న్ని ప్రభుత్వాలు బాధ్యతగా స్వీకరించాలని సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక నాయకులు రామకృష్ణ సూచించారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు పాలనా యంత్రాంగం నుంచి సరై న సమాచారం అందలేక తీవ్ర కష్టాలు పడుతున్నారన్నారు. అనంతరం ఈనెల 17న అనంతపురంలో జరిగే సమాచార ఐక్యవేదికమహసభలపోస్టర్లనువిడుదల చేశారు.

Advertisement
Advertisement