చిట్టీల పేరుతో రూ. 2 కోట్లకు టోపీ | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో రూ. 2 కోట్లకు టోపీ

Published Fri, May 9 2014 4:57 PM

mother, daughter dupes rs 2 crore by chit fund

విశాఖపట్నం: రాష్ట్రంలో మరో చిట్టీల మోసం వెలుగు చూసింది. విశాఖపట్నంలో ఇద్దరు మహిళలు కోట్ల రూపాయలకు జనం నెత్తిన టోపీ పెట్టి పరాయ్యారు. రూ. 2 కోట్ల వరకు మోసగించి పరారయ్యారు. నగరంలోని అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వరలక్ష్మి, అన్నపూర్ణ ఈ మోసానికి పాల్పడ్డారు. దసరా, శ్రావణమాసం చిటీలంటూ వీరు డబ్బులు వసూలు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు వీరి వద్ద చిట్టీలు కట్టారు.

సామాన్ల రిపేరుతో వీరు ఇల్లు ఖాళీ చేసి ఉడాయించారు. మోసం బయట పడడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఎన్నికల విధుల్లో ఉండడంతో పోలీసులు ముందు పట్టించుకోలేదు. తర్వాత తల్లీకూతురు సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే చిట్టీల ద్వారా వీరు వసూలు చేసిన మొత్తం రూ. పది కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు.

Advertisement
Advertisement