బీపీఎల్ పవర్‌తోఎంవోయూ రద్దు | Sakshi
Sakshi News home page

బీపీఎల్ పవర్‌తోఎంవోయూ రద్దు

Published Fri, Feb 14 2014 1:17 AM

MOU called off its agreement with BPL


సాక్షి, హైదరాబాద్: బీపీఎల్ పవర్ ప్రాజెక్ట్స్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా బీపీఎల్‌కు కేటాయించిన 1,262.24 ఎకరాల భూములను కూడా వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాహూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద 660 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లను నెలకొల్పేందుకు 1990ల్లో బీపీఎల్ ముందుకు వచ్చింది. అయితే, ఇప్పటి వరకు సంస్థ విద్యుత్ ప్లాంటును నెలకొల్పలేదు. దీంతో ప్రభుత్వం పైవిధంగా నిర్ణయం తీసుకుంది. కాగా, బీపీఎల్ భూములను జెన్‌కోకు ప్రభుత్వం అప్పగించే అవకాశం ఉంది. ఫలితంగా రామగుండం వద్ద 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లను నెలకొల్పేందుకు జెన్‌కోకు అవకాశం వచ్చినట్టైంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement