చట్టాలు మాకేనా? బాబుకు వర్తించవా? | Sakshi
Sakshi News home page

చట్టాలు మాకేనా? బాబుకు వర్తించవా?

Published Thu, Aug 10 2017 1:57 AM

చట్టాలు మాకేనా? బాబుకు వర్తించవా? - Sakshi

నిలదీసిన కాపు ఉద్యమనేత ముద్రగడ 
 
కిర్లంపూడి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తలపెట్టిన పాదయాత్రను బుధవారం 15వ రోజు కూడా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని పోలీసులు ఆయనకు తెలియజేశారు. దీంతో జేఏసీ నాయకులు, కాపు నాయకులతో కలిసి చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసుకుని ముద్రగడ వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు.

పోలీసులు అనుమతులు లేవనడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబుకు చట్టాలు వర్తించవా? ఆయన రాజ్యాంగానికి అతీతుడా?’ అని మండిపడ్డారు. ముద్రగడ ఇంటివద్ద బుధవారం మధ్యాహ్నం 11 నుండి 12 గంటల వరకు జేఏసి నాయకులు, కాపు నాయకులు, మహిళలు భారీ సంఖ్యలో కంచాల మోత కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Advertisement
Advertisement