'జీవిత ఖైదు వేయిస్తారో.. ఉరిశిక్ష వేయిస్తారో' | Sakshi
Sakshi News home page

'జీవిత ఖైదు వేయిస్తారో.. ఉరిశిక్ష వేయిస్తారో'

Published Mon, Jan 30 2017 7:09 PM

'జీవిత ఖైదు వేయిస్తారో.. ఉరిశిక్ష వేయిస్తారో' - Sakshi

కాకినాడ: 'అధికారంతోపాటు.. చట్టం వారి చేతుల్లోనే ఉన్నాయి. తుని ఘటనలో 'అధినేత చెప్పిన ప్రకారమే తగలబెట్టే కార్యక్రమం చేసి ఉంటే అక్రమంగా పెట్టించిన కేసులు విచారణ చేయమని ఆదేశాలు ఇవ్వొచ్చు. జీవిత ఖైదు వేయిస్తారో ఉరిశిక్ష వేయిస్తారో చేతనైన పని చేయండి' అని ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. 
 
దీంతోపాటు తాను మంత్రిగా పనిచేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిపై కూడా ఎంక్వయిరీ చేయించుకోమని అన్నారు. తప్పుచేస్తే భయపడాలి గానీ.. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? వంకరమాటలు తగ్గించి కాపు జాతికి ఇచ్చిన హామీని అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని అన్నారు. బయట ఉన్నా.. జైలులో ఉన్నా కొన ఊపిరివరకు ఉద్యమం ఆగదని సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ముద్రగడ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement