మున్సి‘పోల్స్’ రిజర్వేషన్లు ఖరారు | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్’ రిజర్వేషన్లు ఖరారు

Published Sun, Mar 2 2014 4:14 AM

Munsi 'polls' reservation finalized

  • కేటాయింపులు ఇలా...
  •  మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట, గుడివాడ.. అన్ రిజర్వుడు
  •  నూజివీడు.. జనరల్ మహిళ
  •  ఉయ్యూరు, నందిగామ.. బీసీ జనరల్
  •  తిరువూరు.. ఎస్సీ మహిళ
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని పురపాలక సంఘాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సమీర్‌శర్మ జీవో నంబరు 94ను శనివారం విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపటంతో పురపాలక సంఘాల్లో చైర్మన్ పదవికి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట, గుడివాడ పురపాలక సంఘాలను అన్ రిజర్వుడు చేశారు.

    నూజివీడు పురపాలక సంఘాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఉయ్యూరు నగర పంచాయతీని బీసీ జనరల్‌కు, తిరువూరు నగర పంచాయతీని ఎస్సీ మహిళకు, నందిగామ నగర పంచాయతీని బీసీ జనరల్‌కు కేటాయించారు. 2011 డిసెంబర్ 28న ఉయ్యూరు, తిరువూరు, నందిగామ మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడుచోట్ల పాలకవర్గాలను మొట్టమొదటి సారిగా ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంది.
     
     మూడున్నరేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే..

     మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, పెడన, జగ్గయ్యపేట మునిసిపాలిటీలు మూడు సంవత్సరాల ఐదు నెలలు (41 నెలలు)గా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. వాటి పదవీ కాలం 2010 సెప్టెంబరు 29 నాటికి ముగిసింది. అప్పటి నుంచి పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించలేదు.
     
     సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉరుకులు పరుగులు...

     పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని తీర్పు
     

Advertisement
Advertisement