ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్ | Sakshi
Sakshi News home page

ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్

Published Thu, Dec 19 2013 9:52 AM

ఎనీ గేమ్..సింగిల్ హ్యాండ్

ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణష్. ఇది సినిమా డైలాగ్. నిజ జీవితంలో కార్మికుడి కొడుకు ఆటైనా.. ఈతైనా.. పరుగైనా.. సైక్లింగైనా.. ఒంటి చేత్తో జాతయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నాడు. మణికట్టు లేకపోయినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న మురళికి వికలాంగులే ప్రేరణ అయ్యారు.  
 
రామగుండం(కరీంగనర్), న్యూస్‌లైన్ :  కరీంనగర్ జిల్లా గోదావరిఖని రాంనగర్‌లో నివాసముంటున్న తడబోయిన రమేష్-లక్ష్మి దంపతులకు శ్రీనివాస్, మురళి, సరళ సంతానం. రమేష్ సింగరేణి రామగుండం-2 ఏరియా పరిధిలోని ఓసీపీ-3 మేయిం టనెన్స్ సెక్షన్‌లో జనరల్ మజ్దూర్‌గా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు మురళికి పుట్టుకతోనే కుడి చేయి మణికట్టు లేదు. దీంతో మానసికంగా కృంగిపోయిన అతడికి కుటుంబ సభ్యులు, మిత్రులు, కోచ్‌ల ప్రోత్సాహం ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఎంబీఏ చదువుతున్న మురళి పట్టుదలతో సాధన చేసి క్రీడల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు.
 
వికలాంగులే ప్రేరణ

చిన్నతనంలో సెలవు దినాల్లో కామారెడ్డి సమీపంలోని ముత్యంపేట గ్రామానికి వెళ్లిన మురళి అక్కడ చూసిన ఆ దృశ్యం అతడి జీవితాన్నే మార్చేసింది. రెండుకాళ్లు, ఒక చేయి లేని వ్యవసాయ కూలి చెరువులో ఈత కొడుతుంటే చూసి ఆక్చర్యపోయాడు. అంతే కాదు.. తన తాత మల్లయ్యకు కంటి చూపు లేకున్నా గోదావరిలో ఈత కొడుతుంటే గమనించాడు. కరీంనగర్‌లో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి మాదాసు శ్రీనివాస్‌కు రెండు కాళ్లు లేవు. ఆయన క్రీడల్లో సత్తా చాటి అర్జున అవార్డుకు ఎంపికవడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు.

ఈ సంఘటనలన్నీ దగ్గరగా గమనించిన మురళిలో ఏదైనా సాధించాలనే తపన పెరిగింది. క్రీడారంగలో అడుగులు ముందుకు వేయడానికి దారి చూపాయి. డిగ్రీ చదువుతున్న కాలేజీ డెరైక్టర్ రాజేందర్, లెక్చర్లు రాజయ్య, రవీందర్ మిత్రులుగా మారిపోయారు. తోటి క్రీడాకారులు అఖిల్‌షాఖన్, మధు, ఆనంద్, కోచ్‌లు కష్ణమూర్తి, కొండయ్య, శ్రీనివా స్, లైఫ్‌సేవింగ్ టీం మెంబర్ గౌతం ప్రోత్సాహం పుష్కలంగా లభించింది. తొలిసారి వరంగల్‌లో స్టేట్‌లెవల్ స్విమ్మింగ్ మీట్‌కు వెళ్లడానికి భయం పడుతుంటే.. మిత్రులు అఖిల్‌షాఖన్, ఆనంద్ కాలేజీకి డుమ్మాకొట్టి పోటీలకు తీసుకుపోగా ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం లో నిలిచాడు. ఇది మురళి క్రీడా జీవితంలో టర్నింగ్‌పాయింట్‌గా మారింది. దీంతో ప్రతీ ఈవెంట్‌ను ఛాలెం జ్‌గా తీసుకుంటూ ముందుకు సాగాడు.  

 సాధించిన విజయాలు

 చెన్నైలో జరిగిన జాతీయ స్థాయి పారా ఒలంపిక్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటాడు. భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మూడు అంశాలలో(750 మీటర్ల ప్రీస్టైల్ స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైకిలింగ్, 5 కిలోమీటర్ల పరుగు పందెం) కోలకతాలో జరిగిన పారా ఒలంపిక్ త్రైత్లాన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో గత ఏడాది అక్టోబర్ 2న జరిగిన రాష్ట్రీయ క్రీడల్లో ఒంటి చేత్తో బ్యాడ్మింటన్ ఆడి బంగా రు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
 
 అంతర్జాతీయ పోటీలే లక్ష్యం

 అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించడమే తన లక్ష్యం. ఇందుకోసం అవసరమైన కసరత్తు చేస్తున్నాను. రక్షణ శాఖ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేష న్(డీఆర్‌డీఓ)లో ఉద్యోగం చేయాలని ఉంది.
 -తడబోయిన మురళి
 

Advertisement
Advertisement