కోర్టుకు హాజరైన నన్నపనేని రాజకుమారి | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన నన్నపనేని రాజకుమారి

Published Sat, Mar 15 2014 3:36 AM

కోర్టుకు హాజరైన నన్నపనేని రాజకుమారి - Sakshi

 పర్చూరు,న్యూస్‌లైన్: టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి శుక్రవారం పర్చూరు కోర్టుకు హాజరయ్యాయి. 2009 జులై నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన  సర్పంచ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. అక్రమంగా కేసు బనాయించారని పేర్కొంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. కమిటీ విచారణ చేపట్టే సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది.
 
 ఘర్షణలో తనపై దాడి జరిగినట్లు నన్నపనేని రాజకుమారి కారంచేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పిటీషనర్‌గా ఉన్న రాజకుమారి విచారణకు హాజరై సాక్ష్యం చెప్పనందున న్యాయమూర్తి బెయిలబుల్ వారంటు జారీచేశారు.
 
 ఈ నేపధ్యంలో శుక్రవారం ఆమె కోర్టుకు వచ్చారు. తన న్యాయవాది ద్వారా వారంటు రద్దుకు పిటీషన్ వేయించి కోర్టులో సాక్ష్యం చెప్పారు. వాదనలు విన్న సీనియర్ సివిల్ జడ్జి సుశీల్‌కుమార్ పాత్రుడు బెయిల్‌బుల్ వారంటు రద్దు చేస్తూ తీర్పుచెప్పారు.
 
 
 నన్నపనేనికి చీరాల కోర్టులో
 రిమాండ్ : బెయిల్‌పై విడుదల ఇదే కేసులో నన్నపనేని రాజకుమారి తమపై దాడిచేసినట్లు కాంగ్రెస్‌పార్టీకి చెందిన వ్యక్తులు కారంచేడు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి రాజకుమారి విచారణకు హాజరు కానందున గతంలో నాన్‌బెయిలబుల్ వారెంటు జారీచేశారు. అయితే శుక్రవారం చీరాల కోర్టుకు వచ్చిన రాజకుమారి న్యాయవాది ద్వారా రీకాల్‌పిటీషన్ వేయించారు.
 
 విచారణ జరిపిన న్యాయవాది నన్నపనేని రాజకుమారిని జుడిషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. వెంటనే బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో బెయిల్ మంజూరు చేస్తూ  అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శివశంకరరెడ్డి తీర్పు చెప్పారు.
 
 

Advertisement
Advertisement