వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాపై లోకేశ్‌ స్పందన | Sakshi
Sakshi News home page

వర్మ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాపై లోకేశ్‌ స్పందన

Published Wed, Oct 11 2017 7:05 PM

nara lokesh reacts on varma lakshmi's NTR - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా.. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' పేరిట సినిమా తెరకెక్కించనున్నట్టు ప్రకటించి.. దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కలకలం రేపిన సంగతి తెలిసిందే. వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’  సినిమాపై తాజాగా ఎన్టీఆర్‌ మనవడు, ఏపీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు.

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుపై లోకేశ్‌ బుధవారం వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ తీయనున్న ఎన్టీఆర్‌ సినిమా గురించి విలేకరులు ప్రస్తావించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తే తీయనీయండి. అది సినిమా మాత్రమే.. సినిమా గురించి మాట్లాడేదేముంటుంది, ప్రజా సమస్యలపైనే నేను స్పందిస్తా’ అని లోకేశ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement