ఎమ్మెల్యే మణిగాంధిపై విరుచుకుపడ్డ జనం | Sakshi
Sakshi News home page

పింఛన్‌.. మేము సచ్చాక ఇస్తారా?

Published Fri, Jun 8 2018 5:47 PM

Nava Nirmana Deeksha  Fail In Kurnool - Sakshi

బురాన్‌దొడ్డి(సి.బెళగల్‌) : ‘‘అయ్యా మేము నాలుగేళ్లుగా తిరుగుతున్నా పింఛన్‌ ఇవ్వడం లేదు. మేము సచ్చాక పింఛన్‌ ఇవ్వాలనుకున్నారా..?’’ అంటూ వృద్ధులు ఎమ్మెల్యే మణిగాంధీని, అధికారులను నిలదీశారు. బుధవారం మండల పరిధిలోని బురాన్‌దొడ్డిలో సర్పంచ్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ నోడల్‌ అధికారి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ గోనెనాయక్‌ జెడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ సిద్ధాలింగమూర్తి, తహసీల్దార్‌ అన్వర్‌హుసేన్, ఆర్‌అండ్‌బీ ఏఈ ఫణీరామ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా వృద్ధులు గంగన్న, జాన్, వితంతువులు వరలక్ష్మి, సువర్ణ, మైబూబాబీ, గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో తాగడానికే నీళ్లు లేవని గ్రామస్తులు దేవరాజు, మాదన్న, ఆనంద్‌ తదితరులు అధికారులను నిలదీశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీలకు శ్మశానానికి స్థలం కేటాయించాలని చంద్రన్న, సుంకన్నలు అధికారులను  కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమనెమ్మ, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement