నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

Published Sat, Jun 27 2015 4:37 AM

నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు

 గుంటూరు క్రైం : నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం రూరల్ జిల్లా పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో 5 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. ఎస్పీ మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఒకే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ వచ్చిన సిబ్బందిని ప్రస్తుతం వారు విధులు నిర్వహిస్తున్న సర్కిల్ నుంచి మరో సర్కిల్‌కు బదిలీ చేస్తున్నామన్నారు. మూడు ఆప్షన్‌ల విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీల వారీగా బదిలీ చేసి పోస్టింగ్‌లు వేశామని స్పష్టం చేశారు.

ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు వున్నా తెలియజేస్తే పరిశీలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం169 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేశామన్నారు. సొంత సర్కిల్‌కు కాకుండా, కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, అధికారుల అనుమతితో పరిష్కరిస్తే పోలీస్‌శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు చందు పూర్ణచంద్రరావు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

 హోంగార్డులకు చెక్కుల పంపిణీ
 గుంటూరు క్రైం : పోలీస్‌శాఖలో సుదీర్ఘకాలం హోంగార్డులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఇద్దరు హోంగార్డులకు జిల్లాలోని హోంగార్డులందరూ కలసి తమ రెండు రోజుల జీతం మొత్తం రూ.4,59 లక్షల నగదు చెక్కులను శుక్రవారం ఎస్పీ నారాయణ నాయక్ చేతుల మీదుగా అందజేశారు. తెనాలికి చెందిన సీహెచ్,సాంబశివరావు, ఎస్.కృష్ణ ప్రసాద్ 1979లో హోంగార్డులుగా విధుల్లో చేరారు. తెనాలి పోలీస్ సర్కిల్ పరిధిలోని విధు లు నిర్వహించి గత ఏడాది ఆగస్టు 1వ తేదీన పదవీ విరమణ పొందారు. సాంబ శివరావుకు రూ.2,31లక్షలు, కృష్ణప్రసాద్‌కు రూ. 2,28లక్షలు చొప్పు న నగదు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌లు ధామస్‌రెడ్డి,సంకురయ్య,ఎస్‌ఐ నిషార్‌బాషా, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement