‘పీహెచ్‌డీ’ ఫలితాల్లో అక్రమాలు జరగలేదు | Sakshi
Sakshi News home page

‘పీహెచ్‌డీ’ ఫలితాల్లో అక్రమాలు జరగలేదు

Published Fri, Sep 27 2013 4:18 AM

no improprietiesin  the 'PhD' results

 తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ :
 తెయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఎలాం టి అక్రమాలు జరగలేదని వీసీ అక్బర్ అలీఖాన్ తెలి పారు. గురువారం తన చాంబర్‌లో ఆయన విలేకరుల తో మాట్లాడారు. ఈ ఏడాది 13 విభాగాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. గతేడాది సబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహించగా, ఈసారి ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షను నిర్వహిం చామన్నారు. 100 మార్కులకు గాను ఎస్సీ, ఎస్టీలకు 30, బీసీలకు 40, ఓసీలకు 50 మార్కులు కటాఫ్ మా ర్కులుగా నిర్ణయించినట్లు చెప్పారు.2013, జూలై 30న 13 సబ్జెక్టులకు పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నిర్వహించగా 411 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను రిజల్ట్స్ కమిటీ ఆమోదం తీసుకుని మంగళవారం యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పెట్టిన ట్లు తెలిపారు.
 
  ప్రకటించిన జాబితా ప్రకారం ప్రవేశ పరీక్షలో 216 మంది ఉత్తీర్ణులైనట్లు వీసీ తెలిపారు. ఈ విషయమై అదేరోజు సాయంత్రం కొందరు విద్యార్థి సంఘాల నాయకులు తన వద్దకు వచ్చి 13 సబ్జెక్టులకు గాను 5 సబ్జెక్టుల్లో 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకు ని కటాఫ్ మార్కులను తగ్గించాలని వినతి పత్రం అం దజేశారని తెలిపారు. డీన్స్‌తో సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తానని తాను హామీ ఇచ్చానని తెలిపారు. తాను స్వయంగా హామీ ఇచ్చినా బుధవా రం ఉదయం కళాశాల తరగతులు ప్రారంభమైన తర్వాత రెండో పీరియడ్‌లో 670 మంది విద్యార్థులను తరగతులు బహిష్కరింపజేయడం దారుణమన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఇలా తరగతులు బహిష్కరించడం, అందోళనలు నిర్వహించడం చేయవద్దని విద్యార్థి సంఘాల నాయకులను ఆయన కోరారు.
 
 వర్సిటీ అభివృద్ధికి విఘాతం
 తరగతులు బహిష్కరించడం వల్ల వర్సిటీ అభివృద్ధికి విఘాతం కలుగుతుందని, విద్యార్థులకు నష్టం జరుగుతుందని వీసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యామండలి నిబంధనల ప్రకారమే కటాఫ్ మార్కులు నిర్ణయించామన్నారు. అయినా విద్యార్థుల వినతి ప్రకారం డీన్స్ సమావేశం నిర్వహించి 50 శాతం ఉత్తీర్ణత కంటే తక్కువ వచ్చిన 5 సబ్జెక్టులకు సంబంధించి కటాఫ్ మార్కులు 5 మార్కులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(సీఓఈ) నసీం ఆధ్వర్యంలో తగ్గించిన కటాఫ్ మార్కుల మేరకు తిరిగి పరీక్షా పేపర్లను పరిశీలించి రెండు రోజు ల్లో ఫలితాలను మళ్లీ ప్రకటిస్తామని వీసీ స్పష్టం చేశా రు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తాను ఆశిస్తున్నానని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఓఈ నసీం పాల్గొన్నారు.

Advertisement
Advertisement