సౌకర్యాలున్నా.. శాలరీ ఏదీ? | Sakshi
Sakshi News home page

సౌకర్యాలున్నా.. శాలరీ ఏదీ?

Published Tue, Feb 17 2015 3:09 AM

సౌకర్యాలున్నా.. శాలరీ ఏదీ? - Sakshi

ఇసుక క్వారీలో పనిచేస్తున్న డ్వాక్రా మహిళల ఆవేదన
అందని జనవరి నెల జీతాలు


తుళ్ళూరు మండలంలోరి బోరుపాలెం ఇసుక రేవులు, రాయపూడి ఇసుక క్వారీని నిర్వహిస్తున్న డ్వాక్రామహిళలకు ఆశించిన స్థాయిలో పారితోషికాలు, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు చొరవచూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాను అరి కట్టేందుకు డ్వామా నేతృత్వంలో రాయపూడి ఇసుక రీచ్‌ను అధికారుల అండదండలతో ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్న డ్వాక్రామహిళలకు రోజూ కూలి కేవలం రూ 300 మాత్రమే ఇస్తున్నారని అవి కూడా సకాలంలో ఇవ్వకుంటే తమ పరిస్థితి ఏమిటని మహిళలు అంటున్నారు. ఎంతో ప్రయాసతో ఇసుక రేవులో విధులు నిర్వహిస్తున్న మహిళలకు కనీస వసతులు, మరుగుదొడ్లు లేక చాలాకాలం ఇబ్బందులు పడ్డారు.

అనంతరం సాక్షిలో వచ్చిన పలు కధనాల అనంతరం స్పందించిన అధికారులు వారికి వసతులు కల్పించారు. ప్రస్తుతం జనవరి నెల జీతాలు ఫిబ్రవరి నెలలో 17 రోజులు గడిచినా రాకపోవడంతో  వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇసుక క్వారీ ఇన్‌చార్జి శేఖర్‌ను వివరణ కోరగా ఫైల్ కలెక్టర్ వద్ద వుందని రెండు రోజుల్లో జీతాలు విడుదలవుతాయని తెలియజేశారు. డిసెంబర్ నెలలో ఇసుక రవాణా చేసిన ట్రాక్టర్ లారీ డ్రైవర్ల కిరాయిలు కూడా ఇవ్వలేదని అడగ్గా డిసెంబర్ 21వ తేదీనుంచి 31వ తేదీ వరకు ఇసుక రావాణా చేసిన వారికి కిరాయిలు రావలసి వుందన్నారు.

Advertisement
Advertisement