సెలవు ఇవ్వని ప్రభుత్వం | Sakshi
Sakshi News home page

సెలవు ఇవ్వని ప్రభుత్వం

Published Sat, Aug 18 2018 2:35 PM

No school holiday AP govt - Sakshi

ఉలవపాడు: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారి వాజ్‌పేయి మృతికి సంతాపంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా శుక్రవారం సెలవుదినంగా ప్రకటించింది. కానీ నిన్నటి వరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇక్కడ సెలవు ప్రకటించలేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం మిత్రపక్షం కాకపోయినా సంతాపదినంతో పాటు అన్ని కార్యాలయాలకు, పాఠశాలలకు సెలవు ఇచ్చింది. దీనిని బట్టి చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటో అర్థం అవుతుందని ప్రజలంటున్నారు. ఓ వ్యక్తి మరణించిన తరువాత కూడా పార్టీల మధ్య ఉన్న విభేదం వల్లే ఇలా చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.

 ఇటీవల చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు పాఠశాలలు మొత్తం మూసివేసి విద్యార్థులను తరలించారు. కార్యాలయాల్లోని అధికారులందరూ అక్కడే మకాం వేసి ఏర్పాట్లు చేశారు. కానీ ఓ మాజీ ప్రధానికి విలువ ఇవ్వలేకపోయారు. కేంద్ర ప్రభుత్వ శాఖల ఆధీనంలో కార్యాలయాలు తక్కువగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఎక్కువగా ఉంటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందని ఉద్యోగులు ఆశించారు. కానీ అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేశాయి. 

Advertisement
Advertisement