భవిష్యత్‌లో న్యూక్లియర్ అవసరం | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌లో న్యూక్లియర్ అవసరం

Published Sat, Jan 25 2014 3:26 AM

భవిష్యత్‌లో న్యూక్లియర్ అవసరం

 డెంకాడ, న్యూస్‌లైన్:
 భవిష్యత్‌లో దేశ ప్రజలకు విద్యుత్, ఇతర అవసరాలు తీరాలంటే అణుశక్తి (న్యూక్లియ ర్ పవర్) తప్పదని న్యూక్లియర్ రీ సైకిల్ గ్రూప్ డెరైక్టర్ పికె వత్తల్ అన్నారు. ‘జాతీయ అభివృద్ధిలో అణుశక్తి పాత్ర’ అనే అంశంపై చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అణుశక్తి వినియోగంపై ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చేందుకు రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు ఉపకరించి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన ప్రదర్శన కూడా చైతన్యం కలిగించిందన్నారు.
 
 కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎల్ రాజు మాట్లాడుతూ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంత పెద్దస్థాయిలో అణుశక్తిపై  సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు. దీని ద్వారా యువత, విద్యార్థులు, అధ్యాపకుల్లో కూడా అవగాహన వచ్చిందన్నారు. కార్యక్రమంలో బార్క్ మీడియా రిలేషన్ హెడ్ ఆర్‌కే సింగ్, వైస్ ప్రిన్స్‌పాల్ డీజేఏ రామచంద్రరాజు, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ రంగరాజు, పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
 క్విజ్ విజేతలకు బహుమతులు
 రెండు రోజుల అణుశక్తి సదస్సుపై విద్యార్థుల కు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయనగరంలోని సన్ స్కూల్‌కు చెందిన ఎంఎన్‌ఎస్ నాగేంద్ర మొదటి స్థానం లో నిలిచారు. అలాగే  శ్రీప్రకాష్ విద్యాసంస్థకు చెందిన జి సాయికార్తీక్, జి సాయిసాగర్‌లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలు అంజేశారు. ప్రతిభ కనబరిచిన  మరి కొందరు విద్యార్థులకు కూడా ప్రశంసాపత్రాలు అందించారు. వీరిని త్వరలో బార్క్‌కు ఆహ్వానిస్తారు.
 
 

Advertisement
Advertisement