డెంగీతో నర్సింగ్ విద్యార్థిని మృతి | Sakshi
Sakshi News home page

డెంగీతో నర్సింగ్ విద్యార్థిని మృతి

Published Mon, Oct 7 2013 3:00 AM

Nursing student dies of dengue fever

హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో నర్సింగ్ కోర్సు చేస్తున్న మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని డెంగీతో చి కిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. నర్సింగ్ స్కూ ల్ ప్రిన్సిపాల్, ఉస్మానియా వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని నర్సింగ్ విద్యార్థినులు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే..మెదక్ జిల్లా టేక్మాల్‌కు చెందిన నాగభూషణం, స్వ రూపల మొదటి సంతానమైన మౌనిక(20) ఉస్మానియా నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
 
 ఈ నెల 3న మౌనికతోపాటు పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఇన్‌పేషెంట్లుగా చేర్చుకున్నారు. వైద్య పరీక్షల్లో మౌనికకు డెంగీ సోకినట్టు తేలిం ది. అప్పటికే ఆమె ఆరోగ్యం విషమించి అపస్మారక స్థితికి చేరుకోవడంలో వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున చనిపోయింది. వైద్యు ల నిర్లక్ష్యం, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లే మౌనిక చనిపోయిందని ఆరోపిస్తూ సహచర విద్యార్థినులు ఆం దోళనకు దిగారు. వీరికి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు సంఘీభావం తెలిపి ఆసుపత్రిలోని కులీకుతుబ్‌షా భవనం ఎదుట బైఠాయించారు.
 
 విషయం తెలిసి ఆసుపత్రికి వచ్చిన ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరామిరెడ్డి, ఆర్‌ఎంఓ-1 డాక్టర్. ఎం.అంజయ్య, ఆర్‌ఎంఓ డాక్టర్ నజాఫీబేగం, నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ శాంతకుమారిలను ఘెరావ్ చేశారు. మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివరామిరెడ్డి నర్సింగ్ విద్యార్థినులు, ఎ్‌స్‌ఎఫ్‌ఐ ప్రతినిధులతో చర్చలు జరిపి డిమాం డ్లను నెరవేరుస్తామని, మౌనిక తల్లి స్వరూపకు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు శాంతిం చారు. మౌనిక అంత్యక్రియల నిమిత్తం ఆయన రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా.. నర్సులు, ఇతర సిబ్బంది రూ.15 వేల నగదును పోగుచేసి మౌనిక తల్లికి అందజేశారు. అనంతరం మౌనిక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement