నూతనోత్తేజం | Sakshi
Sakshi News home page

నూతనోత్తేజం

Published Sat, Sep 20 2014 1:35 AM

నూతనోత్తేజం

సాక్షి, అనంతపురం : పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమీక్షలు వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. పార్టీ నిర్మాణం, ప్రజా ఉద్యమాలు తదితర అంశాలపై అధినేత దశ, దిశను నిర్దేశించారు. భవిష్యత్ మనదేనంటూ మనోధైర్యాన్ని నింపారు. ఆయన చూపిన బాటలో నడిచేందుకు పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధమయ్యాయి. మరీ ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, మోసపూరిత హామీలపై పోరుబాటకు సమాయత్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలో పార్టీ స్థితిగతులపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం శివారు బెంగళూరు రహదారిలోని రామకృష్ణ ఫంక్షన్ హాలులో గురు, శుక్రవారాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు ఫంక్షన్‌హాలుకు చేరుకున్న జగన్ రెండోరోజు సమీక్ష సమావేశాలను ఆరంభించారు. తొలుత అనంతపురం, కళ్యాణదుర్గం, తర్వాత రాప్తాడు, రాయదుర్గం, చివరిగా గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. సామాన్య కార్యకర్త సైతం తన అభిప్రాయాలను వ్యక్తపరిచేలా అవకాశం కల్పించారు. కార్యకర్తలు చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజకీయ రణ క్షేత్రంలో టక్కుటమార విద్యలు తగవని, విలువలు, విశ్వసనీయతతోనే ప్రజల హృదయాలను గెలుద్దామని పిలుపునిచ్చారు. వర్తమాన రాజకీయాల్లో ప్రజల పక్షాన సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషిద్దామన్నారు. కార్యకర్తలకు తానున్నాననే రోసా కల్పించారు. తనతో పాటు పార్టీలోని ప్రతి నాయకుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి ప్రతి గ్రామంలో తిరుగుతూ.. క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని, అందులో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు వారిచ్చే సూచనలు, సలహాలు తీసుకోవాలని జిల్లా నేతలను ఆదేశించారు. ఏయే నాయకుడు ఎన్నెన్ని సమీక్షలు పెడుతున్నారు.. ఎలా పని చేస్తున్నారన్న విషయాలను తాము హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తుంటామని చెప్పడంతో.. కార్యకర్తల నుంచి మంచి స్పందన కనిపించింది. ‘సీఎం చంద్రబాబు పాలనపై ఇప్పటికే ప్రజావ్యతిరేకత వచ్చింది. ఈ తరుణంలో ప్రజల పక్షాన నిలబడి పోరుబాట సాగించాల’ని జగన్ సూచించినప్పుడు ‘మీ ఆదేశాలే మాకు శిరోధార్యం’ అంటూ కార్యకర్తలు పెద్దపెట్టున నినదించారు. ‘మోసపూరిత విధానాల వల్ల లభించే పదవి ఎక్కువ కాలం నిలవదు. అటువంటి పదవి అక్కర్లేదు. అలాంటి విధానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించలేను.
 ఆలస్యమైనా ధర్మమే గెలుస్తుంది. ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకునేలా మంచి పాలన తీసుకొచ్చే దిశగా వైఎస్సార్‌సీపీ అడుగులు వేస్తోంద’ని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మొత్తమ్మీద పార్టీ స్థితిగతులపై రెండు రోజుల పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షల్లో ఆయన చేసిన ప్రసంగాలు కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సమావేశాల్లో మాజీ ఎంపీ ఎంవీ మైసూరారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీజీసీ సభ్యులు బి.గురునాథ్‌రెడ్డి, తోపుదుర్తి కవిత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాప్తాడు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, బోయ తిప్పేస్వామి, వై.వెంకట్రామిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, తాడిపత్రి కో-కన్వీనర్ రమేష్‌రెడ్డి, నాయకులు దుద్దేకుంట శ్రీధర్‌రెడ్డి, బి.ఎర్రిస్వామిరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, బొంబాయి రమేష్, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, రాగే పరశురాం, నదీం, బోయ తిరుపాలు, దిలీప్‌రెడ్డి, ధనుంజయ యాదవ్, మీసాల రంగన్న, చెనిక్కాయల గురుప్రసాద్, గుత్తి రంగారెడ్డి, కాపు భారతి, ఏడీసీసీ చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉష, నగరాధ్యక్షురాలు శ్రీదేవి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement