మే మూడున గీతం బీబీఏ ఆప్టిట్యూడ్ టెస్ట్ | Sakshi
Sakshi News home page

మే మూడున గీతం బీబీఏ ఆప్టిట్యూడ్ టెస్ట్

Published Sat, Apr 26 2014 3:28 AM

on 3rd may gitam BBA Aptitude Test

 గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ-ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి మే మూడో తేదీన ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు గీతం మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శివరామకృష్ణ తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు మూడేళ్ల బీబీఎం (ఆనర్స్) కోర్సులో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.

 

బీబీఎం కోర్సులో అంతర్భాగంగా చార్టర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ (సీమా) కోర్సును అందిస్తున్నామని వివరించారు. సీమా అకడమిక్ రిలేషన్స్ జాతీయ అధిపతి అయ్యన్ మహాపాత్రా మాట్లాడుతూ సీమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వృత్తి నిపుణుల సంస్థ అని, ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మంది సభ్యులున్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 177కు పైగా దేశాల్లో గుర్తింపు పొందిన సీమా కోర్సులో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో 4,500 కార్పొరేట్, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయని వివరించారు.

 

 దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సీమా కోర్సును అందిస్తుండగా రాష్ట్రంలో గీతం విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజమెంట్ అడ్మిషన్స్ చైర్‌పర్సన్ డాక్టర్ కేపీ కిషన్ మాట్లాడుతూ బీబీఏ (ఆనర్స్) ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు www.g-it-am.-ed-u/gim లో దరఖాస్తు చేయాలని సూచించారు.

Advertisement
Advertisement