కాంగ్రెస్ నేతలపై టీడీపీ దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నేతలపై టీడీపీ దౌర్జన్యం

Published Tue, Jun 9 2015 5:46 AM

కాంగ్రెస్ నేతలపై టీడీపీ దౌర్జన్యం - Sakshi

డీసీసీ అధ్యక్షుడి వాహనంపై దాడి
కారు అద్దాలు ధ్వంసం
చిత్తూరు (అర్బన్):
చిత్తూరులో తెలుగుదేశం నేతలు కొందరు సోమవారం కాంగ్రెస్ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. చంద్రబాబు హామీలు నెరవేర్చలేదని నిరసన తెలియజేస్తున్నవారిని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి వాహనాన్ని ధ్వంసం చేశారు. సీఎంగా ఏడాది కాలం పూర్తయినా చంద్రబాబు ఇచ్చిన  హామీలు నెరవేర్చలేదని నిరసన తెలియజేయడానికి సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గాంధీ విగ్రహానికి వేసి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేయడానికి సన్నద్ధమయ్యారు.

ఇంతలో వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసీఆర్‌పై ఫిర్యాదు చేసి వస్తున్న టీడీపీ నాయకులు వీరిని చూశారు. కొందరు బడా నాయకులు కాంగ్రెస్ పార్టీ నిరసనను అడ్డుకోమని చెప్పి ఆజ్యం పోసి వెళ్లిపోయారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడుంటే పింఛన్లు ఇవ్వబోమని, బ్యాంకు రుణాల్లో కోతలు విధిస్తామని చెప్పి మహిళలను అక్కడి నుంచి తరిమేశారు.

సోనియా గాంధీ వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని, చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు అన్నీ మేలు జరుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని మండిపడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ నాయకుల వెంటపడ్డారు. తాము నిరసన వ్యక్తం చేృుడానికి పోలీసుల అనుమతి ఉందని చెబుతున్నా టీడీపీ నాయకులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ నాయకులు వాహనంలో వెళుతుండగా వెంబడించి నడిరృడ్డుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో డీసీసీ అధ్యక్షుడి కారుకు రెండువైపులా అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉన్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. జిల్లా కలెక్టర్, వన్‌టౌన్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.

పోలీసుల ప్రేక్షక పాత్ర
కాంగ్రెస్ నాయకులపై టీడీపీ నాయకు ల దౌర్జన్యానికి పాల్పడగా, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసనకు పోలీసులు ముందస్తుగా అనుమతి ఇచ్చారు. అయితే వీరిని టీడీపీ నాయకులు అడ్డుకుంటుండగా పోలీసులు పట్టించుకోలేదు. ఒక దశలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రెండు చేతులు జోడించి తమ నిరసనకు అడ్డురావద్దని టీడీపీ నాయకులను వేడుకున్నారు. అయినా సరే దీనికి అధికారపార్టీ నాయకులు అంగీకరించకపోవడంతో భయంతో వెనుదిగారు. పోలీసులే అక్కడి నుంచి కాంగ్రెస్ నాయకులను వాహనం ఎ క్కించి పంపేశారు. పోలీసుల తీరుపై, టీడీపీ నాయకుల వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Advertisement
Advertisement