ఆన్‌లైన్లో లోకల్ మార్కెట్ | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్లో లోకల్ మార్కెట్

Published Mon, Mar 14 2016 5:24 AM

ఆన్‌లైన్లో లోకల్ మార్కెట్

ఇప్పుడు యువకుల నుంచి పెద్దల వరకూ నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ మార్కెటింగ్ వైపు చూస్తున్నారు. సెల్ చార్జర్ నుంచి కంప్యూటర్ వరకు ప్రతి వస్తువునూ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ ఉండడం సహజం. అరుుతే స్థానికంగా ఉండే వ్యాపారాలను కూడా ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే way2bazar. జిల్లాలోని ప్రధాన నగరాల్లో షాపులను కూడా ఆన్‌లైన్ మార్కెటింగ్ పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో పందలపాకకు చెందిన పడాల మురళీవెంకటకృష్ణారెడ్డి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు.

ఎం.ఫార్మసీ, ఎంబీఏ చదివిన వెంకటకృష్ణారెడ్డి తన మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.

 - పందలపాక (బిక్కవోలు)

 
* ఆకట్టుకుంటున్న way2bazar వెబ్‌సైట్
* రూపొందించిన వెంకటకృష్ణారెడ్డి
* ఆదరణ బాగుందంటున్న వ్యాపారులు

స్థానిక ఆన్‌లైన్ మార్కెటింగ్ ఎలా చేస్తారంటే.. ఆన్‌లైన్ మార్కెటింగ్ చేసే ప్రధాన పట్టణాల్లో షాపులను way2bazarలో నమోదు చేస్తారు. నమోదైన షాపులు స్థానికంగా మార్కెటింగ్ చేసే వస్తువులపై వారు ఇచ్చే డిస్కౌంట్లను, షాపులో లభ్యమయ్యే వస్తువుల వివరాలను ఆన్‌లైన్లో పొందుపరుస్తారు. ఈ సైట్ చూసే వారికి ఏ షాపులో ఏ వస్తువులు లభిస్తాయి, ఎంత రిబేటు లభిస్తుంది తదితర వివరాలు తెలుస్తాయి.

ఈ సైట్‌లో లాగిన్ అయిన వారికి ఒక కూపన్ కూడా ఇస్తారు. ఈ కూపన్ తీసుకు వెళ్తే అదనంగా షాపు వారు రిబేట్ ఇస్తారు. ఇప్పుడు జిల్లాలో ఈ వెబ్‌సైట్‌కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పోటీ కారణంగా దెబ్బతింటున్న స్థానిక వ్యాపారాలను నిలబెట్టేందుకు ఈ తరహా వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు వెంకటకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలలో ఈ వెబ్‌సైట్‌ను విశాఖపట్నంలో కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
 
వ్యాపారం పెరిగింది..
ఈ వెబ్‌సైట్ లో రిజిస్టరయ్యాను. వెబ్‌సైట్ చూసి షాపునకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతికి వ్యాపారం బాగా సాగింది.
- మహేష్, సోనా షాపింగ్‌మాల్, కాకినాడ
 
స్థానిక వ్యాపారులకు మంచి అవకాశం..
స్థానిక వ్యాపారులకు ఈ వెబ్‌సైట్ చక్కటి అవకాశం. ఇప్పుడందరూ ఇంటర్నెట్ ఎక్కువగా చూస్తున్నారు. ఈ వెబ్‌సైట్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
- శివ, ఫ్యాషన్‌మాల్, రాజమండ్రి
 
త్వరలో శాఖల విస్తరణ
స్థానిక వ్యాపారాలకు వెబ్‌సైట్ ప్రారంభించాలన్న ఆలోచననే ఆచరణలో పెట్టాను. వ్యాపారులతో పాటు ప్రజల నుంచీ ఆదరణ
 లభిస్తోంది. త్వరలో శాఖలు విస్తరిస్తా.
- పడాల మురళీవెంకటకృష్ణారెడ్డి, వెబ్‌సైట్ రూపకర్త

Advertisement

తప్పక చదవండి

Advertisement