పల్లెల్లో ‘పంచాయతీ’ చిచ్చు | Sakshi
Sakshi News home page

పల్లెల్లో ‘పంచాయతీ’ చిచ్చు

Published Mon, Aug 5 2013 3:20 AM

pachayathi elections are raiseing the issues

చందంపేట, న్యూస్‌లైన్ :  పంచాయతీ ఎన్నికల లొల్లిలో పచ్చని పల్లెలు భగ్గుమంటున్నాయి. పార్టీ పరంగా గెలుపు, ఓటమి చవి చూసిన నాయకులు ఘర్షణలకు ఉసిగల్పడంతో   నాలుగు రోజులుగా పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెల కొంది.  గత నెల 31 జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీ డీపీ అభ్యర్థులు బరిలో దిగి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మండలంలో జరిగిన 17 గ్రామపంచాయతీ ఎన్నికల్లో 7 గ్రామపంచాయతీలు మి త్రపక్షాలు గెలుపొందగా, 10 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.  చిత్రియాల టీడీపీ భారీ మెజారిటీతో గెలువడంతో అక్కడ ఉన్న టీడీపీ వర్గీయులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేయడంతో ఆర్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నేరడుగొమ్ము కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా టీడీపీ వర్గీయులు కాంగ్రెస్ నాయకులపై చిన్నపెద్ద తేడా లేకుండా దాడీ చేశారు.
 
 ఈ ఘటనలో ఆర్గురికి గాయాలయ్యాయి. గాగిళ్లపురంలో టీడీపీ  కార్యకర్తలు శనివారం రాత్రి కాంగ్రెస్ కార్యకర్తపై దాడి చేయడంతో పలువురికి గాయాలపాల య్యాయి. చందంపేట గ్రామపంచాయతీ పరిధిలోని అచ్చంపేట పట్టితండాకు చెందిన నేనావత్ లచ్చిరాంను టీడీపీ వర్గీయులు కొట్టడంతో  గాయాలపాలై ఆదివారం  పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.   సీఐ రవికుమార్, ఎస్‌ఐ శివకుమార్ ఆయా గ్రామాల్లో  పికెటింగ్ ఏర్పాటు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement