ద్వారకాతిరుమల: నువ్వు మాకొద్దు.. మా గ్రామానికి రావద్దు.. ఓటమిని అందుకో అంటూ గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ముందుకెళ్లనివ్వకుండా చుట్టుముట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపురంకు వచ్చిన ఎమ్మెల్యేకు సోమవారం రాత్రి ఈ చేదు అనుభవం ఎదురైంది. ద్వారకాతిరుమల మండలంలో సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రాత్రి తిమ్మాపురంకు వచ్చారు. తొలుత పార్టీకి చెందిన వాసిరెడ్డి ప్రవీణ్ ఇంటి వద్ద ఆగారు. ఈలోగా ప్రచారాన్ని టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభిద్దామని ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువర ప్రసాద్ ఎమ్మెల్యేను కోరారు. అయితే ప్రవీణ్ వర్గం ఇందుకు ఒప్పుకోలేదు. అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించాలని కోరింది. దీంతో ఎంపీపీ ప్రచార రథాన్ని దిగి వెళ్లిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ వర్గ నేతలు భగ్గుమన్నారు. వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే మాకొద్దంటూ పార్టీ గ్రామ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు పోలిన శ్రీనివాసరావు, ఎంపీటీసీ కూచింపూడి శ్రీనివాసరావు, ఘంటా సత్యనారాయణ తదితరులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మా గ్రామానికి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా ఆటోలను నిలిపారు. నువ్వు మాకొద్దు.. వెళ్లిపో అంటూ ఎమ్మెల్యేను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. ఎలా గెలుస్తావో చూస్తామంటూ హెచ్చరించారు. ఇది చూసిన గ్రామస్తులు నివ్వెరబోయారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, ఘంటా బాబ్జి తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పార్టీ నేత ఘంటా సత్యనారాయణ ఇంటి వద్ద పంచాయితీ పెట్టారు. రెండు వర్గాలను వారు బుజ్జగించారు. అయితే ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లిపోయారు.
ముప్పిడికి పరాభవం
Published Tue, Mar 26 2019 2:37 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్‌లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్‌స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement