ఇళ్ల మధ్య బెల్టుషాపులతో ఇబ్బంది పడుతున్నాం | Sakshi
Sakshi News home page

ఇళ్ల మధ్య బెల్టుషాపులతో ఇబ్బంది పడుతున్నాం

Published Sat, Mar 31 2018 7:13 AM

People Shairing Their Sorrows To YS Jagan - Sakshi

‘అన్నా.. గ్రామంలో ఇళ్ల మధ్య బెల్టు షాపులు నిర్వహించడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం’ అంటూ పలువురు మహిళలు జననేత ఎదుట వాపోయారు.  ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాటిబండ్లలో జగన్‌కు కలసి సమస్య వివరించారు. బెల్టు షాపులు తొలగించాలని గతంలో స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎలాగైనా గ్రామాల్లో బెల్టు దందాను తరిమికొట్టాలని కోరారు. లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై  స్పందించిన జగన్‌ మనందరి ప్రభుత్వం రాగానే గ్రామాలలో బెల్టు షాపులు లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement