కష్టంగా బతుకీడుస్తున్నాం | Sakshi
Sakshi News home page

కష్టంగా బతుకీడుస్తున్నాం

Published Fri, Mar 30 2018 6:44 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు: ‘ఏం చేస్తాం నాయనా.. పనులు లేక మా బతుకులు ఇట్టా అయిపోయాయి’ అంటూ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వలస కూలీలు జననేత ఎదుట వాపోయారు.  సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో మిర్చి, పత్తికోతలకు వచ్చిన వ్యవసాయకూలీలు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్‌కు తమ సమస్యలు వివరించారు. గత నాలుగేళ్లుగా తమ ప్రాంతంలో సాగునీరు అందడం లేదని, కనీసం మెట్టపైర్లు కూడా సక్రమంగా పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రోజుకు రూ.200 కూలి వస్తుందని.. కష్టంగా బతుకీడుస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. ఎలాగైనా తమ ప్రాంతానికి సాగునీరందేలా చూడాలని వెంకటస్వామి, సునందమ్మ, అఖిల, లక్ష్మి, లలిత, గంగమ్మ, సోమేశ్వరి వైఎస్‌ జగన్‌ను కోరారు.

Advertisement
Advertisement