అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయాం | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయాం

Published Thu, May 3 2018 7:59 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణా జిల్లా : ‘అన్నా...మాది నిరుపేద కుటుంబం. కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాం. పైసా,పైసా కూడబెట్టి అగ్రిగోల్డ్‌లో పొదుపు చేస్తే సంస్థ సొమ్మును వెనక్కి ఇవ్వకుండా మోసం చేసింది’ అని మచిలీ పట్నం పరిధిలోని చిలకలపూడి రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చెందిన దాసరి సంధ్య ప్రజా సంకల్పయాత్రలో జననేత జగన్‌ను కలసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు పిల్లలతో తినీతినక దాచిన సొమ్ము కూతరు పేరు మీద రూ.50వేలు, విడతల వారీగా రూ.1లక్ష అగ్రిగోల్డ్‌లో పొదుపు చేశామన్నారు.

పిల్లల చదువుకి ఉపయోగపడుతాయని దాచిన సొమ్ము అవసరానికి అందకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కుటుంబ పోషణ భారంగా మారి నరకయాతన పడుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌  ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్లనే తన కూతురు పాలిటెక్నిక్‌ పూర్తి చేసిందని,లేదంటే చదువు మాన్పించే వాళ్లమని భావోద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అగ్రిగోల్డ్‌లో దాచిన సొమ్ము బాధితులకుఅందేలా చూడాలని ఆమె జననేతను కోరారు.

Advertisement
Advertisement