Sakshi News home page

ఆధారం లేదు.. ఆదుకోండయ్యా!

Published Sun, May 13 2018 7:31 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

కృష్ణాజిల్లా  : ‘అయ్యా.. మేమంతా పూలమొక్కలు, పూసలు, పిన్నీసులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం.. గత 30 ఏళ్ల నుంచి ఇలా రోడ్డుపక్కనే కనీస వసతులు కూడా లేక బతుకుతున్నాం. ప్రభుత్వం మాకు ఇల్లులు ఇస్తామని చెప్పి పట్టించుకోవడం లేదు’  అని భైరవపట్నం సమీపంలోని ప్రత్తిపాటి సెంటర్‌కు చెందిన çపూసల పనులు చేసే సంచార జాతుల మహిళలు అనసూయ,సీత, రబీనా, దుర్గా తదితరులు జననేత జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆ ప్రాంతానికి విచ్చేసిన జగన్‌ను కలిసిన వారు తాము పడుతున్న దీనావస్థను ఆయనకు వివరించి బోరున విలపించారు. తమకు ఉండేందుకు ఇళ్లు లేకపోవడం వల్ల చంటిపిల్లలు, మహిళలతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రధానంగా స్నానాలు చేసేందుకు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి నరకయాతన పడుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. 100 కుటుంబాలకు పైగా జీవిస్తున్నామని మా అందరికి మీరైనా కాలనీల మాదిరిగా ఇల్లులు కట్టి ఇవ్వాలని జగన్‌ను కోరారు.

Advertisement

What’s your opinion

Advertisement