వడ్డెర్లను ఎస్సీల్లో చేర్చాలి | Sakshi
Sakshi News home page

వడ్డెర్లను ఎస్సీల్లో చేర్చాలి

Published Thu, Jun 14 2018 7:21 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జిల్లాలో 40 వేల మంది ఉన్న వడ్డెర్లను ఎస్సీల్లో చేర్చడానికి చర్యలు తీసుకుంటామని గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. అనివార్య పరిస్థితుల్లో ఆయన మృతి చెందడంతో మా సమస్య పరిష్కారం కాలేదు. మా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని మమ్మల్ని ఆదుకోవాలి. అవకాశం ఉన్నంతలో వడ్డెర్లను ఎస్సీల్లో చేర్చడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం.

రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నాం– కారపురెడ్డి గంగాభవాని, మొల్లేటి కోటేశ్వరి, ఇన్నీసుపేట, రాజమహేంద్రవరం
అన్నా! రాజమహేంద్రవరం ఇన్నీసుపేట నక్కలగూడెంలో 15 ఏళ్ల క్రితం అగ్ని  ప్రమాదంలో 150 ఇళ్లు కాలిపోయాయి. వాటి స్థానంలో ఇప్పటి వరకు మాకు కాలనీ ఇళ్లు మంజూరు చేయలేదు. కాలిపోయిన ఇళ్ల స్థానంలో అప్పులు చేసుకుని రేకులు షెడ్లు వేసుకుని జీవిస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తరువాత మాకు కాలనీ ఇళ్లు మంజూరు చేసి ఇవ్వాలన్నా..

కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వడంలేదు– అంగటి లక్ష్మి, ధవళేశ్వరం
ధవళేశ్వరంలోని కంచర లైన్‌ ఏరియాకు తాగునీరు అందడంలేదు. వాటర్‌ ట్యాంక్‌ నిర్మించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదు. తాగునీరు లేక అల్లాడుతున్నాం.

Advertisement

తప్పక చదవండి

Advertisement