చిన్నారికి అన్న ప్రాసన | Sakshi
Sakshi News home page

చిన్నారికి అన్న ప్రాసన

Published Sat, Dec 22 2018 8:45 AM

People Sharing Thier Problems to YS Jagan - Sakshi

శ్రీకాకుళం :నా కుమార్తె అప్పిని తీక్షాద్యకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతితో తొలి ముద్ద తినిపించి అన్నప్రాసన చేయడం ఎంతో ఆనందంగా ఉంది. జగనన్న పుట్టిన రోజున మాకు ఇటువంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం.– కుమార్తె తీక్షాద్యతో లెనిన్, జ్యోత్స్న, దండుగోపాలపురం, సంతబొమ్మాళి మండలం

బయోమెట్రిక్‌తో ఇబ్బందులు
నేను ఒంటరి మహిళను. వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో పింఛన్, రేషన్‌ అందడం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను.బయోమెట్రిక్‌ వంటి నిబంధనలతో నాలాంటి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకా లు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలి.–  బి.పీతమ్మ, దామోదరపురం, టెక్కలి మండలం

లంచం ఇస్తేనే బిల్లు..
లంచం ఇవ్వనిదే ప్రభుత్వం అందజేసే బిల్లులు మంజూరు చేయడం లేదు. ఇల్లు మంజూరు చేయాలంటే గ్రామంలోని ప్రజాప్రతినిధులకు లంచం ఇవ్వాలి. తర్వాత బిల్లు పొందాలంటే మరోసారి లంచం ఇవ్వాల్సిందే. దీంతో సామాన్యుడికి ఇబ్బందులు తప్పడం లేదు. మీపాలనలో పేదవాడికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలయ్యా..     – దుప్పట్ల గోవిందు,దామోదరపురం, టెక్కలి మండలం

అందని సంక్షేమ పథకాలు
బృందావనం గ్రామంలో 35 కుటుంబాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉన్నాయని ఎటువంటి సంక్షేమ పథకాలు అందజేయడం లేదు. రేషన్‌ బియ్యం తప్పా ఏవీ మంజూరు చేయడం లేదు. అర్హతలు ఉన్నా పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయడం లేదు. ప్రభుత్వం అందజేస్తున్న దివ్యాంగుల పింఛను సరిపోవడం లేదు. మీ పాలనలో మాలాంటి అందరికీ న్యాయం చేయాలయ్యా..– అప్పిని విశ్వనాథం, బృందావనం, సంతబొమ్మాళి

Advertisement
Advertisement