Sakshi News home page

ప్రజలే నిలదీస్తారు!

Published Wed, Aug 20 2014 3:55 AM

ప్రజలే నిలదీస్తారు! - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ : టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజలే ఆ పార్టీ నాయకులను నిలదీస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ నియోజకవర్గ ఇన్‌చార్జి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పాత హామీలను నెరవేర్చలేక, కొత్త హామీలు ప్రకటి  స్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక భవిష్యత్తులో టీడీపీ నాయకులు ప్రజలకు తమ ముఖాలను కూడా చూపిం చలేని పరిస్థితి వస్తుందని చెప్పారు.

మంగళవారం తన నివాసంలో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ  మంచి పనులు చేస్తే మద్దతు ఇస్తామని.. ఇదే సందర్భం లో వివక్షతో వ్యవహరించే కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. మూడు నెలలుగా అధికార పార్టీ నేతలు తమ వ్యక్తిగత ద్వేషాలను తీర్చుకునే ప్రయత్నా లు చేయడం దురదృష్టకరమన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబులా మోసపూరిత హా మీలు ఇవ్వలేకే జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉం డాల్సి వచ్చిందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కార్యకర్తలు రోజులో గంట కేటాయించాలన్నారు.

నాయకులు, కార్యకర్తల సూచన మేరకు ఇకపై నియోజకవర్గ స్థాయి సమావేశాలు వార్డుల్లో, గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పిన కోలగట్ల వచ్చేనెల సమావేశం పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని అధినేత కోరుతున్నారని అయితే తాను జనవరి నెలలో స్వీకరిస్తానని చెప్పానన్నారు. జగన్ నిర్ణయం మేరకు క్యాబినేట్ సమావేశాలు ముగిసిన తరు వాత డిసెంబర్ రెండో వారంలో పార్టీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందన్నారు.
 
తనకు కాకుండా వేరే ఎవరికి బాధ్యతలు అప్పగించినా పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు వచ్చే నెల 2న నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే నెలవారీ సమావే శాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు మామిడి అప్పలనాయుడు, గొర్లె వెంకటరమణ, ఆశపు వేణు, బంగారు నాయుడు, జమ్ము శ్రీను, కెల్ల శ్రీను, కంది గణపతి, గదుల సత్యలత, బోడసింగి  ఈశ్వరరావు, బొద్దాన అప్పారావు  పాల్గొన్నారు.

Advertisement
Advertisement