నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల బంద్ | Sakshi
Sakshi News home page

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల బంద్

Published Sun, Aug 30 2015 2:56 AM

నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల బంద్ - Sakshi

♦ డీలర్ల అత్మహత్యలు చూడాల్సి వస్తుంది
♦ బంద్‌ను విజయవంతం చేయండి
♦ పెట్రోల్ బంక్‌ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్
 
 నెల్లూరు(రెవెన్యూ) : సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటను విస్మరించడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ నెల 30 ఆర్ధరాత్రి నుంచి 31 ఆర్ధరాత్రి వరకు పెట్రోల్ బంకుల బంద్‌ను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రవికుమార్ వెల్లడించారు. శనివారం నెల్లూరు దర్గమిట్టలోని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్రో ల్, డీజిల్‌పై రూ.4 వ్యాట్‌ను రద్దుచేయాలన్నారు. ఫారం ఎఫ్, బీ లెసైన్స్‌లను పూర్తిగా రద్దుచేయాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారుల వేధింపులను అరికట్టాలన్నారు.

ఆయిల్ ట్యాంకర్ల కిరాయిపై వసూలు చేయతలపెట్టిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 24 గంటలు మాత్రమే బంద్ చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే బంద్‌ను కొనసాగిస్తామని హెచ్చరించారు. వ్యాట్ విధింపుతో డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇలాగైతే డీలర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసులురెడ్డి, కోశాధికారి చమడుగు శ్రీనివాస్, పి. జితేంద్ర పాల్గొన్నారు.

Advertisement
Advertisement