ఒక్కచాన్స్... ప్లీజ్ | Sakshi
Sakshi News home page

ఒక్కచాన్స్... ప్లీజ్

Published Wed, Jun 11 2014 2:03 AM

Please One  Chance TDP  leaders

విజయనగరం ఫూల్‌బాగ్: పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్... ఇదీ పట్టణంలోని అశోక్‌బంగ్లాలో ఒక తెలుగుతమ్ముడు జిల్లా నాయకునికి వేడుకోలు. సార్ ప దేళ్లపాటు పార్టీ కోసం ఎంతో పనిచేశాను. కో- ఆప్షన్ ఇప్పించండి’ ఇది మరో తెలుగు తమ్ముడి విజ్ఞాపన. మున్సిపాల్టీలో పాల కవర్గం ఇంకా కొలువు తీరలేదు. కానీ కో-ఆప్షన్ పదవుల కో సం తెలుగుతమ్ముళ్లు పైరవీలు సాగిస్తున్నారు.
 
 మూడు కో-ఆప్షన్ పదవులే
 విజయగనరం మున్సిపాల్టీలో మూడు కో-ఆప్ష న్ పదవులు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం ఒకటి మైనార్టీ వర్గానికి, మరొకటి మహిళలకు కేటాయించాల్సి ఉంది. మరొక పదవి మున్సిప ల్ చట్టాలపై అవగాహన ఉండి, చదువుకున్న వారికే లభిస్తుంది. మైనార్టీ వర్గాల నుంచి ఎస్‌కెఎం భాషాతోపాటు టీడీపీలోకి వచ్చిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదితో పాటు పలువురు ముస్లిం నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు. టీడీపీ మైనార్టీ సెల్ నాయకునిగా ఉన్న ఎస్‌కేఎం భాషా భార్య కౌన్సిలర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌కెఎం భాషాకు ఈసారి కో-ఆప్షన్ పదవి దక్కకపోవచ్చునని టీడీపీ వర్గాల అభిప్రాయం. మహిళా కోటా నుంచి టీడీపీ జిల్లా కార్యదర్శి ఐవీపీ రాజు భార్య పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఐవీపీ రాజు పార్టీ పెద్దల వద్ద తన అభిప్రాయం వ్య క్తం చేసినట్టు సమాచారం. దీంతో ఆమెకు కో- ఆప్షన్ పదవి కేటాయించడం లాంఛన ప్రాయమైనట్టు తెలుస్తోం ది. ఇక మూడో కో-ఆప్షన్  పదవి కోసం పోటీ భారీస్థాయిలో ఉంది. ఈ జాబితా చాంతాడంత ఉంది. టీడీపీ నాయకులు కేఏపీ ప్రసాద్‌రాజు కూడా కో-ఆప్షన్ పదవిని ఆశిస్తున్నారు.అదేవిధంగా డాక్టర్ వీఎస్ ప్రసాద్, డాక్టర్ రామయ్య కూడా తమతమ ప్రయత్నాలు  సాగిస్తున్నారు.
 
 యాదవ సామాజిక వర్గానికి లేనట్లేనా?
 మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణకు దాదాపుగా ఖరారైపోయింది. ప్రసాదుల రామకృష్ణ యాదవసామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పా టు మున్సిపాలిటీలో ఏడుగురు కౌన్సిలర్లు యా దవ సామాజిక వర్గానికి చెందినవారు విజయం సాధించారు. దీంతో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈసారి కో-ఆప్షన్ పదవి ద క్కకపోవచ్చుననే వార్తలువినిపిస్తున్నాయి. యా దవ సామాజిక వర్గం నుంచి ఇప్పలి అప్పల కొండ, కిల్లాన మహేష్‌యాదవ్, కాగిత శ్రీనివాస్‌యాదవ్ బంటుపల్లి శ్రీనివాస్‌యాదవ్, గొల గాని రమేష్‌యాదవ్, గువ్వల తిరుపతిరావుయాదవ్, పూసర్ల రమణయాదవ్, నైదాన శ్రీని వాసరావుయాదవ్‌తో తదితరులుఆశిస్తున్నారు. కౌన్సిలర్‌గా పోటీచేసి ఓడిపోయిన మద్దాల ము త్యాలరావు, టీడీపీ నాయకుడు గొల్లకోటి గురునాథ్ కూడా  తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
 
 పారిశ్రామిక చైర్మన్ ఆశలు
 వీటి అగ్రహారం ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవాడ చైర్మన్‌కు మున్సిపాల్టీలో కో-ఆప్షన్ పదవిని నామినేటెడ్ చేసే అవకాశాలు కల్పిస్తున్నా యి. ఒక వేళ ఇదే జరిగితే మున్సిపాల్టీలో కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య మూడు నుంచి నా లుగుకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పారి శ్రామికవాడ చైర్మన్ మచ్చి రామలింగస్వామి కూడా కో-ఆప్షన్ పదవిని ఆశిస్తున్నారు. ఈయ న మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఖరారైన ప్రసాదుల రామకృష్ణకు బంధువు. అందువల్ల తనకు అవకాశం ఉందని భావిస్తున్నారు.
 
 అశోక్ రాకతోనే లెక్కతేలేది..
 కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఈ నెల 13వ తేదీన జిల్లాకు రానున్నట్టు తెలుస్తోంది. ఆయన వస్తే ఎవరెవరికి పదవులు వస్తాయనేది తేలు తుంది. తమ వద్దకు వచ్చిన ఆశావహులకు అశోక్ వస్తేగాని ఏమీ చెప్పలేమని టీడీపీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ద్వారపురెడ్డి, జగదీష్, ఐవీపీ రాజు, ప్రసాదుల రామకృష్ణ చెప్తున్నట్టు సమాచారం.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement