Sakshi News home page

పోలవరం’ నిర్వాసితులుగా గుర్తించాలి

Published Wed, Aug 22 2018 7:30 AM

Polavaram Expats Meet YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

విశాఖపట్నం :మాది ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి. సుమారు 50 ఏళ్లుగా ఇక్కడ పూరిపాకలు నిర్మించుకుని 35కి పైగా కుటంబాలు కొండపై పండిన పండ్లను అమ్ముకుని జీవిస్తున్నాం. ఇటీవల పోలవరం ప్రాజెక్టు పనులంటే మా పాకలను  తొలగిం చి మమ్మల్ని తరిమేశారు. ఇంటి స్ధలాలు కూడా ఇవ్వలేదు. పక్కన ఉన్న మరో కొండవాగు వద్ద పాకలు కట్టుకుంటే అవీ తొలగించాలని, ఈ స్థలం సుగర్‌ఫ్యాక్టరీదని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మాలాంటివారికి  నివసించేందుకు చోటు కూడా ఇవ్వడం లేదు. మా నివాసాలను పోలవరం ప్రాజెక్టు కోసం కూల్చినందుకు మమ్మల్ని కూడా బాధితులుగా గుర్తించాలి. న్యాయం చేయాలని జగన్‌ను కలిశాం.  మనందరి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.– పోలవరం ప్రాజెక్టు బాధితులు, దార్లపూడి

Advertisement
Advertisement