వేసవిలో పోలీసు బదిలీలు | Sakshi
Sakshi News home page

వేసవిలో పోలీసు బదిలీలు

Published Fri, Jan 17 2014 2:08 AM

వేసవిలో పోలీసు బదిలీలు

సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో విద్యా సంవత్సరానికి అనుగుణంగా వేసవిలో బదిలీలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, సీఐల వరకు బదిలీలకు సంబంధించి రూపొందించిన నూతన క్యాలెండర్‌ను అమలుచేయాలని డీజీపీ ప్రసాదరావు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రెండేళ్ల సర్వీసు పూర్తికాకుండా ఎవరినీ బదిలీ చేయవద్దని పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు చైర్మన్ హోదాలో డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
 
 ఎప్పుడుపడితే అప్పుడు బదిలీలు చేయడం, విధివిధానాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. మిగతా ప్రభుత్వ శాఖల్లో మాదిరిగా బదిలీలను చేపట్టడం ద్వారా సిబ్బందిలో మనోస్థైర్యం పెంచాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్‌ఐ వరకూ బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు అంతగా లేకున్నా ఎస్‌ఐ, సీఐ బదిలీలలో ప్రజాప్రతినిధుల జోక్యంతో అధికారుల తలబొప్పికడుతోంది. నూతన మార్గదర్శకాలను పాటించటంపై పోలీసు కో ఆర్డినేషన్ విభాగం అదనపు డీజీ వినయ్‌కుమార్‌సింగ్ త్వరలో డీఐజీ, ఐజీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
 
 బదిలీల క్యాలెండర్ మార్గదర్శకాలివే...
 ళీ    కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వరకూ విధ్యా సంవత్సరానికి అనుగుణంగానే బదిలీలు చేయాలి.
 ళీ    అత్యవసర పరిస్థితుల్లో పరిపాలనా సౌలభ్యంకోసం, పదోన్నతి వల్ల ఖాళీలు ఏర్పడినప్పుడు మాత్రమే విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేసే అవకాశం ఉంది.
 ళీ    విధి నిర్వహణలో, కేసుల దర్యాప్తులో సామర్థ్యం లేకుండా వ్యవహరించినా... అధికారి స్వచ్ఛందంగా  కోరుకున్నా బదిలీ చేయవచ్చు.
 ళీ    ఐదేళ్లు సర్వీసు పూర్తయిన ప్రతి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌నూ అదే రీజియన్‌లోని వేరొక జిల్లాకు పంపాలి.
 ళీ    ఐదేళ్లు సర్వీసు పూర్తయిన ఎస్‌ఐని ఇతర సబ్ డివిజన్‌కు పంపాలి. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ను మరో సర్కిల్‌కు బదిలీ చేయాలి.
 ళీ    అధికారులు, సిబ్బంది నిర్ణీత గడువుకన్నా ముందుగానే కొన్ని కారణాలతో తిరిగి తమ స్థానాలకు వస్తే వారికి ప్రధానమైన పోస్టులు ఇవ్వరాదు.
 ళీ    ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న సిబ్బందిని ప్రధానమైన పోస్టులకు దూరంగా ఉంచాలి.
 ళీ    స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏసీబీ లాంటి విభాగాలలో పనిచేసి వచ్చిన వారికి ప్రధాన పోస్టులు అప్పగించాలి.

Advertisement
Advertisement