‘పొలిటికల్‌ పంచ్‌’ రవికిరణ్‌ అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

‘పొలిటికల్‌ పంచ్‌’ రవికిరణ్‌ అరెస్ట్‌

Published Sat, Apr 22 2017 2:32 AM

‘పొలిటికల్‌ పంచ్‌’ రవికిరణ్‌ అరెస్ట్‌ - Sakshi

► అర్ధరాత్రి అతడి ఇంటి నుంచి తీసుకెళ్లిన తుళ్లూరు పోలీసులు
► శంషాబాద్‌ డీసీపీకి రవికిరణ్‌ భార్య ఫిర్యాదు
► రాజకీయాలపై స్పందించడం నేరమవుతుందా అని ప్రశ్న
► సోషల్‌ మీడియాను అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు
► వైఎస్సార్‌సీపీ నేతల విమర్శ


హైదరాబాద్‌: తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పొలిటికల్‌ పంచ్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న ఇంటూరి రవికిరణ్‌ (35)ను గురువారం అర్ధరాత్రి తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రవికిరణ్‌.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ ఇంట్లో ఏడాది న్నరగా అద్దెకు నివాసముంటున్నాడు. ఇంట్లోనే వెబ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం అర్ధరా త్రి ఒంటిగంటకు ఆదర్శనగర్‌ కాలనీలో ఉన్న అత డి నివాసానికి ఐదుగురు పోలీసులు వచ్చారు. ముందుగా ఇంటి యజమాని నీరటి రాజుతో మాట్లాడిన వారు.. ఆ తర్వాత రవికిరణ్‌ ఇంట్లోకి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మీరు ఎవరని రవికిరణ్‌ భార్య సుజన ప్రశ్నించగా.. తాము తుళ్లూరు పోలీసులమని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై అభ్యంతరక రంగా వెబ్‌సైట్‌లో ప్రచారం చేస్తున్న కారణంగా అరెస్ట్‌ చేస్తున్నామని చెప్పి తీసుకెళ్లారు. దీంతో సుజన తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

డీసీపీకి ఫిర్యాదు
అర్ధరాత్రి వచ్చి తన భర్తను కొందరు తుళ్లూరు పోలీసులమంటూ తీసుకెళ్లారని, ఇంతవరకు తనకు ఎలాంటి సమచారమూ లేదని, తన భర్త ఆచూకీ కనుగొనాలంటూ రవికిరణ్‌ భార్య సుజన శంషా బాద్‌ డీసీపీ పి.వి.పద్మజకు గురువారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన భర్త కిడ్నాప్‌ అయి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్‌ చేయాల్సినంత నేరం తన భర్త ఏమి చేశాడని ఆమె ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై పౌరులుగా స్పందించడం నేరమవుతుందా అని నిలదీశారు. ఏపీ పోలీసులే తన భర్తను తీసుకెళ్లి ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలన్నారు.

ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అసహనం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పరిపాలన తీరుతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోయిందని వైఎస్సార్‌సీపీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌ అన్నారు. రవికిరణ్‌ కుటుంబానికి మద్దతుగా వారు శంషాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమ వుతున్న బాబు సర్కారు మీడియాతో పాటు సోష ల్‌ మీడియాను అణగదొ క్కేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించే హక్కు ప్రజలకు లేదా అని నిలదీశారు. సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారందరినీ జైల్లో పెడతారా అని ప్రశ్నిం చారు. రవికిరణ్‌ అరెస్ట్‌ అన్యాయమన్నారు. వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉం టుందని తెలిపారు. రవికిరణ్‌ కుటుంబాన్ని పరా మర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ నేత తాడి భాస్కర్‌రెడ్డి, ఆర్‌.రవిశంకర్‌ తదితరులున్నారు.

అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదుతో అరెస్టు: గుంటూరు ఎస్పీ నాయక్‌
సాక్షి, అమరావతి: శాసనమండలి భవనం ఫొటోపై పోర్నోగ్రఫీ ఫొటో పెట్టినందునే ‘పొలిటికల్‌ పంచ్‌’ వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని గుంటూరు రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌ మీడియాకు తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. శానసనసభ కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద రవికిరణ్‌పై కేసులు నమోదు చేశామన్నారు. విచారణ నిమిత్తం రవికిరణ్‌ను గుంటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement